ఆటో రంగానికి ఏమైంది? 18 ఏళ్ళ కనిష్టానికి పడిపోయిన నెలవారీ అమ్మకాలు!!

ఆటో రంగానికి ఏమైంది? 18 ఏళ్ళ కనిష్టానికి పడిపోయిన నెలవారీ అమ్మకాలు!!

తమ యూనిట్ల అమ్మకాల్లో కనీ విని ఎరగని తరుగుదలను ఎదుర్కొంటోంది ఆటో పరిశ్రమ. ఆటో సెక్టార్, ఆటో ఉపకరణాల ఉత్పత్తి రంగం అమ్మకాలు లేక  పూర్తిగా వెల వెల బోతుంది. పాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో దాదాపు 21శాతం తగ్గుదల కనబడుతోందని ఆటో వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు నెలలుగా ఎన్నికల వాతావరణం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి మందగించడం వంటి కారణాలతో ఆటో రంగంలో అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో వెహికిల్స్ ఉత్పత్తిని బలవంతంగా నిలిపి వేయాల్సి వచ్చిందని ఆటో సెక్టార్‌లోని కంపెనీలు అంటున్నాయి. గోడౌన్లలో నిండిపోయి ఉన్న  టూవీలర్స్‌ డిమాండ్‌ లేక అలానే ఉన్నాయని, కొత్త బండ్ల ఉత్పత్తులను నిలిపి వేయాల్సి వచ్చిందని టూవీలర్ కంపెనీలు పేర్కొన్నాయి. 

Image result for cars cheers

బుధవారం నాటి మార్కెట్లలో BSE ఆటో ఇండెక్స్ అత్యంత వరస్ట్ ప్రదర్శన చేసింది. ఇంట్రాడేలో దాదాపు ఆటో ఇండెక్స్ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. BSE ఆటో ఇండెక్స్ లోని 16 కంపెనీల్లో 14 కంపెనీల స్టాక్స్ తీవ్ర కోతకు గురయ్యాయి. మారుతీ సుజుకీ 1.52 శాతం, బజాజ్ ఆటో 1.48శాతం, టీవీఎస్ మోటార్ కంపెనీ 1.41శాతం, హీరో మోటోకార్ప్ 1.09శాతం , మహీంద్రా & మహీంద్ర 0.81శాతం నష్టపోయాయి. నెల వారీ బేసిస్‌లో చూస్తే.. వెహికిల్స్ అమ్మకాలు 4శాతం పెరిగి 20,86,358 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అయితే.. వార్షిక ప్రాతిపదికన (YoY) చూస్తే మాత్రం అమ్మకాలు 9శాతం తగ్గాయి. ఆటో పరిశ్రమలో అన్ని రంగాలను కలుపుకుంటే.. ప్యాసింజర్ వెహికిల్స్, కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్‌లో 10-21 శాతం క్షీణత కనబడింది. కమర్షియల్ వెహికిల్స్ తయారీ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ స్టాక్స్ 1.21శాతం నష్టపోయి రూ. 90.10 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అలాగే టాటా మోటార్స్ 0.50శాతం క్షీణతతో రూ. 169.80 వద్ద ట్రేడ్ అయింది. ఇక కార్ల విడి భాగాల ఉత్పత్తుల తయారీ కంపెనీలు  తమ ఆక్సిలరీస్‌ మీద అమ్మకాలు, సప్లై డిమాండ్  లేక తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయి. ప్రపంచ వృద్ధి రేటు మాంద్యం, గ్లోబల్ ట్రేడ్ వార్ వంటి అంశాలతో ఎగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోయాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆటో రంగం పూర్తిగా కుదేలయ్యింది. ప్రపంచంలోనే లార్జెస్ట్ వెహికిల్ మార్కెట్‌ అయిన చైనాలో ఆటో సేల్స్ 16.4శాతం పడిపోయాయి.

Image result for mahendra and mahendra

దేశంలో ఈ క్షీణత మరింత కాలం కొనసాగవచ్చని, రూరల్ ప్రాంతంలో డిమాండ్ తగ్గడం, కొనుగోలు శక్తి మందగించడం, నగదు లభ్యత కొరత సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న NBFC రంగం ఆశావహంగా లేక పోవడం వంటి కారణాలతో ఆటో పరిశ్రమ నష్టాల బాటలో ఉందని రిలయన్స్ సెక్యూరిటీస్ భావిస్తోంది. అంతేకాకుండా వెహికిల్స్ ప్రామాణికాలు కూడా మారడం, ఎంపిక చేసిన సెగ్మెంట్లలో రేట్ల వత్యాసం  భారీగా వుండటం, BS-IV ఎమిషన్ నిబంధనలు మరింత కఠిన తరం కావడంతో ఆటో సెక్టార్ పలు సమస్యలను ఎదుర్కొంటుంది. చాలా కంపెనీలు BS-IV నిబంధనలకు లోబడి ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీకి సిద్ధపడుతుండటంతో ఆ ప్రభావం ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్న వెహికిల్స్ అమ్మకాల మీద తీవ్రంగా ఉంటుందని హీరో మోటోకార్ప్ అభిప్రాయపడుతుంది. అదీ కాకుండా గోరు చుట్టు మీద రోకటి పోటులా ఇప్పటికే ఆటో పరిశ్రమలో అమ్మకాలు లేకపోగా ప్రభుత్వం కొత్తగా 2023 నాటికి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ (ICE ) ద్వారా నడిచే త్రీవీలర్స్ (ఆటోలు) ను బ్యాన్ చేయాలని నిర్ణయించింది. ఇక 2025 నాటికి టూవీలర్స్ రంగంలో 150 cc ఇంజిన్లతో ఉన్న వెహికిల్స్ ను కూడా బ్యాన్ చేయాలన్న ఆలోచనతో ఉండటం ఆటో పరిశ్రమకు శరాఘాతంలా మారింది. ఈ పరిణామాల మధ్య ఆటో రంగంలోని కంపెనీలు తమ ఉత్పత్తులపై GST లెవీ , కార్పోరేట్ ట్యాక్సులను తగ్గించాలని , దీనివల్ల కొంతలో కొంత ఉపశమనం దొరుకుతుందని భావిస్తున్నాయి. రానున్న మరో 4 నెలల తరువాత పంట దిగుబడి బాగుండి, రైతులు, గ్రామీణ ప్రాంత వినియోగ దారుల కొనుగోలు శక్తి పెరిగితే  తప్ప ఆటో రంగానికి పట్టిన గ్రహణం వీడకపోవచ్చని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. 

Image result for tata motors vehicles models
 tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');