నష్టాల ముగింపు- రియల్టీ డౌన్‌!

నష్టాల ముగింపు- రియల్టీ డౌన్‌!

రోజంతా నేలచూపులతోనే కదిలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో వెనకడుగుతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి పతన బాట పట్టాయి. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,624 దిగువకు చేరగా.. నిఫ్టీ 11,866 వరకూ నీరసించింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడటంతో రోజంతా నష్టాల మధ్యే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 194 పాయింట్లు క్షీణించి 39,757 వద్ద నిలవగా.. నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,906 వద్ద స్థిరపడింది. మూడు రోజులపాటు ర్యాలీ చేసిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

మెటల్‌ ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా 2-0.7 శాతం మధ్య బలహీనపడగా.. మెటల్‌ 0.4 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 8 శాతం పతనంకాగా, యస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టెక్ మహీంద్రా, మారుతీ, హీరోమోటో, ఇండస్‌ఇండ్‌, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌ 3-1.4 శాతం మధ్య నీరసించాయి. అయితే టాటా స్టీల్‌, గెయిల్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా, టీసీఎస్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా 3-0.4 శాతం మధ్య లాభపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌ 6.3-0.7 శాతం మధ్య క్షీణించాయి.  

ఎఫ్అండ్‌వో ఇలా
డెరివేటివ్స్‌లో సుజ్లాన్‌, ఆర్‌కేపిటల్‌, జైన్‌ ఇరిగేషన్‌, బీఈఎంఎల్‌, బయోకాన్‌, బిర్లాసాఫ్ట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, సీజీ పవర్‌ 8-3.5 శాతం మధ్య పతనంకాగా.. మదర్‌సన్, దివాన్‌ హౌసింగ్‌, మెక్‌డోవెల్‌, చెన్నై పెట్రో, ఎన్‌సీసీ, జస్ట్‌డయల్‌, అదానీ పవర్‌, సెయిల్‌ 3.3-1.5 శాతం మధ్య బలపడ్డాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో ముగిసిన నేపథ్యంలో మధ్య, చిన్నతరహా షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.5 శాతం చొప్పున క్షీణించాయి. ట్రేడైన షేర్లలో 1489 నష్టపోగా.. 1027 లాభాలతో నిలిచాయి. 

డీఐఐల విక్రయాలు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 96 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 151 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. కాగా.. నగదు విభాగంలో సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 216 కోట్లు,  డీఐఐలు రూ. 171 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌చేశాయి. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');