ఇంటర్‌నేషనల్‌ కంబ్యూషన్‌ జూమ్‌

ఇంటర్‌నేషనల్‌ కంబ్యూషన్‌ జూమ్‌

స్పెయిన్‌ కంపెనీతో సాంకేతిక ఒప్పందం, లైసెన్సింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ఇంటర్‌నేషనల్‌ కంబ్యూషన్‌ ఇండియా కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 268 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 274 వరకూ ఎగసింది. ఇతర వివరాలు ఇవీ..

సిమెంటోస్‌కు సై
స్పెయిన్‌ కంపెనీ సిమెంటోస్‌ కాపా ఎస్‌ఎల్‌తో విదేశీ సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు డైవర్సిఫైడ్‌ సంస్థ ఇంటర్‌నేషనల్‌ కంబ్యూషన్‌ పేర్కొంది. దీంతోపాటు ట్రేడ్‌మార్క్‌ లైసెన్స్‌ ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఒప్పందంలో భాగంగా సిమెంటోస్‌ టెక్నాలజీ ద్వారా విభిన్న బిల్డింగ్‌ మెటీరియల్‌ ప్రొడక్ట్స్‌ రూపొందించనుంది. వీటిలో టైల్‌ అధెసివ్స్‌, వాటర్‌ప్రూఫింగ్ కాంపౌండ్స్‌, ఎపోక్సీ గ్రౌట్స్‌ తదితరాలను తయారు చేయనుంది. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లోగల ప్లాంటు ద్వారా సిమెంటోస్‌ ట్రేడ్‌మార్క్‌ కాపా(CAPA) పేరుతో ప్రొడక్టులను తయారు చేయనున్నట్లు తెలియజేసింది. వీటిని ఆసియా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు వివరించింది. ప్రధానంగా మినరల్‌, మెటీరియల్‌ ప్రాసెసింగ్‌, హ్యాండ్లింగ్‌ పరికరాలు, గేర్‌ బాక్సులు, గేర్‌డ్ మోటార్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ల తయారీ సంస్థ ఇంటర్‌నేషనల్‌ కంబ్యూషన్‌లో ప్రమోటర్లకు ప్రస్తుతం 52.79% వాటా ఉంది. Most Popular