సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా... ఈరోస్‌- బోర్లా

సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా... ఈరోస్‌- బోర్లా

రేటింగ్‌ సంస్థ కేర్‌ కంపెనీ ఔట్‌లుక్‌ను ప్రతికూలానికి సవరించిన నేపథ్యంలో మౌలిక సదుపాయాల సంస్థ సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊంపదుకున్నాయి. కాగా.. మరోవైపు ఇప్పటికే పతనబాటలో సాగుతున్న మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ కౌంటర్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాజాగా కంపెనీ కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ను విదేశీ దిగ్గజం మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఈ కౌంటర్‌ వరుసగా ఐదో రోజు డౌన్‌సర్క్యూట్‌ను తాకింది. వివరాలు చూద్దాం..

సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌
కంపెనీ బ్యాంక్‌ సౌకర్యాలను రేటింగ్‌ సంస్థ కేర్‌.. స్థిరత్వం(స్టేబుల్‌) నుంచి ప్రతికూలం(నెగిటివ్‌)గా సవరించినట్లు సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక రుణసామర్థ్య రేటింగ్‌ను మాత్రం A-గా కొనసాగించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా షేరు దాదాపు 4.3 శాతం పతనమై రూ. 128 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 126 వరకూ జారిది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!

Image result for Eros international ltd

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌
ఇప్పటికే పతనబాట పట్టిన ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. తాజాగా మూడీస్‌ ఇన్వెస్టర్ సర్వీసెస్‌ సైతం కార్పొరేట్‌ ఫ్యామిలీ రేటింగ్‌ను B1 నుంచి B2కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో డీలాపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 10 శాతం పతనమై రూ. 33.25 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. కంపెనీ బ్యాంకు రుణ సౌకర్యాలను రేటింగ్‌ సంస్థ కేర్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో గత ఐదు రోజులుగా లోయర్‌ సర్క్యూట్‌ను తాకుతున్న సంగతి తెలిసిందే. వెరసి ఐదు రోజుల్లో 50 శాతం కోల్పోయింది.Most Popular