పతన బాట... రియల్టీ, బ్యాంక్స్‌ డౌన్‌

పతన బాట... రియల్టీ, బ్యాంక్స్‌ డౌన్‌

బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాట పట్టాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో నేలచూపులతో మొదలైన మార్కెట్లు ప్రస్తుతం మరింత నీరసించాయి. వరుసగా మూడు రోజులపాటు ర్యాలీ చేసిన మార్కెట్లో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 253 పాయింట్లు పతనమై 39,697కు చేరగా.. నిఫ్టీ 75 పాయింట్లు క్షీణించి 11,891 వద్ద కదులుతోంది. వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగియగా.. ఆసియా మార్కెట్లలో అత్యధిక శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 

మెటల్‌ ఎదురీత
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఆటో, బ్యాంక్‌ నిఫ్టీ, ఐటీ 1 శాతం స్థాయిలో బలహీనపడగా.. మెటల్‌ 0.5 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 7 శాతం పతనంకాగా, యస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టెక్ మహీంద్రా, బజాజ్‌ ఆటో, కొటక్‌ బ్యాంక్‌, మారుతీ, హీరోమోటో, పవర్‌గ్రిడ్‌, యూపీఎల్‌ 3-1.4 శాతం మధ్య నీరసించాయి. అయితే టాటా స్టీల్‌, గెయిల్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, వేదాంతా, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌ 2.3-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌, సన్‌టెక్ 2.3-0.5 శాతం మధ్య నీరసించాయి.  

జైన్‌ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో జైన్‌ ఇరిగేషన్‌, బిర్లా సాఫ్ట్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండియా సిమెంట్స్‌, బయోకాన్‌, చోళమండలం, బీఈఎంఎల్‌ 5-2.2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివాన్‌, పీసీ జ్యువెలర్స్‌, ఆర్‌పవర్‌, మదర్‌సన్, జస్ట్‌డయల్‌, అదానీ పవర్, గాడ్‌ఫ్రే ఫిలిప్‌, జిందాల్‌ స్టీల్‌, టొరంట్ ఫార్మా 4.4-2 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1281 నష్టపోగా.. 924 లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఆప్టిమస్‌, విండ్‌సర్‌, ఈరోస్‌, ఐబీ ఇంటిగ్రే, సోరిల్‌, జెనిసిస్‌, తంగమాయిల్‌, ఎన్‌డీఎల్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, ఇగార్షీ, సింప్లెక్స్‌, ముకంద్‌, ఫిలాటెక్స్‌, మన్‌పసంద్‌, రామ్‌కీ, బీఆర్‌ఎన్‌ఎల్‌ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular