ఐబీ హౌసింగ్‌- యస్‌బ్యాంక్‌ పతన బాట

ఐబీ హౌసింగ్‌- యస్‌బ్యాంక్‌ పతన బాట

దాదాపు రూ. లక్ష కోట్ల నిధులను దారిమళ్లించిందన్న ఆరోపణల నేపథ్యంలో వరుసగా రెండో రోజు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. కాగా.. మరోపక్క నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి ముకేష్ సబర్వాల్‌ రాజీనామా చేసినట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం బలహీనపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళతప్పాయి. వివరాలు చూద్దాం..

ఐబీ హౌసింగ్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్‌ షేరు దాదాపు 7 శాతం పతనమై రూ. 629 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 625 వరకూ జారింది. కాగా.. మంగళవారం సైతం ఈ షేరు 8 శాతంపైగా పడిపోయి రూ. 674 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఇండియాబుల్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ గెహ్లాట్‌సహా ఇతర డైరెక్టర్లు వ్యక్తిగత అవసరాలకోసం రూ. 98,000 కోట్ల పబ్లిక్‌ నిధులను దారిమళ్లించినట్లు సుప్రీం కోర్టులో సోమవారం(10న) పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకోమంటూ పిటిషనర్‌ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న అభయ్‌ యాదవ్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. స్పెయిన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ హరీష్‌ ఫెబియానీ సహాయంతో గెహ్లాట్ పలు షెల్‌ కంపెనీలను సృష్టించారని, వీటికి అక్రమ రుణాల ద్వారా ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ భారీ స్థాయిలో నిధులను మళ్లించిందని పిటిషన్‌లో అభయ్‌ ఆరోపించారు. అయితే ఇండియాబుల్స్‌ గ్రూప్‌పై అక్రమంగా బురదజల్లుతున్నట్లు గ్రూప్‌ చైర్మన్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. రూ. 98,000 కోట్లు దారిమళ్లించారన్న ఆరోపణలు అర్ధంలేనివని తెలియజేశారు.

Related image

యస్‌ బ్యాంక్‌
నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి మంగళవారం ముకేష్ సబర్వాల్‌ రాజీనామా చేసినట్లు యస్‌ బ్యాంక్‌ పేర్కొంది. కాగా.. సోమవారం నాన్‌ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి అజయ్‌ కుమార్‌ తప్పుకున్నట్లు బ్యాంక్‌ తెలియజేసింది. బ్యాంక్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చేపడుతున్న నేపథ్యంలో వీరిరువురూ రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 3 శాతం పతనమై రూ. 135 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 134 వరకూ నీరసించింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');