జోష్‌లో.. దివాన్‌ హౌసింగ్‌ -మదర్‌సన్‌ 

జోష్‌లో.. దివాన్‌ హౌసింగ్‌ -మదర్‌సన్‌ 

మార్పిడికి వీలుకాని డిబెంచర్ల(ఎన్‌సీడీలు) చెల్లింపులను పూర్తిచేసినట్లు వెల్లడించడంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్ కౌంటర్కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోవైపు విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం క్రెడిట్‌ స్వీస్‌ కంపెనీపట్ల సానుకూలంగా స్పందించడంతో ఆటో విడిభాగాల దిగ్గజం మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం...

దివాన్‌ హౌసింగ్ ఫైనాన్స్‌
గడువు ముగిసిన దాదాపు రూ. 962 కోట్ల విలువైన ఎన్‌సీడీల చెల్లింపులను ఈ నెల 6కల్లా పూర్తిచేసినట్లు వెల్లడించడంతో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) తాజాగా పేర్కొంది. దీంతో కంపెనీ రేటింగ్స్‌ను అప్‌గ్రేడ్‌ చేయవలసిందిగా రేటింగ్‌ ఏజెన్సీలను కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ నేపథ్యంలో దివాన్ హౌసింగ్‌ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 4.4 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 96 వరకూ ఎగసింది. కాగా.. ప్రమోటర్లు వాధ్వాన్‌ గ్లోబల్‌ కేపిటల్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు గల వాటాలతోసహా బ్లాక్‌స్టోన్‌ 97.7 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఆధార్‌ హౌసింగ్‌ వెల్లడించింది. 

Image result for motherson sumi systems ltd

మదర్‌సన్‌ సుమీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధం(అక్టోబర్‌-మార్చి) నుంచి మదర్‌సన్‌ సుమీ సిస్టమ్స్‌ పనితీరు మెరుగుపడే వీలున్నట్లు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ తాజాగా అంచనా వేసింది. తద్వారా మార్జిన్లు మెరుగుపడే అవకాశమున్నదని పేర్కొంది. దీంతో మదర్‌సన్‌ సుమీ షేరుపట్ల సానుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో సాధించగల వృద్ధిత పోలిస్తే ప్రస్తుతం షేరు విలువ ఆకర్షణీయంగా ఉన్నదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మదర్‌సన్‌ సుమీ షేరు 3.4 శాతం పుంజుకుని రూ. 122 వద్ద ట్రేడవుతోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');