నష్టాలతో షురూ- మెటల్‌ ఎదురీత

నష్టాలతో షురూ- మెటల్‌ ఎదురీత

వరుసగా మూడో రోజు లాభపడిన దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో నేలచూపులతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 166 పాయింట్లు క్షీణించి 39,784కు చేరగా.. నిఫ్టీ 45 పాయింట్లు నీరసించి 11,921 వద్ద కదులుతోంది. వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. అయితే ఆసియా మార్కెట్లలో అత్యధిక శాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. దీంతో దేశీయంగానూ కొంతమేర సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. 

రియల్టీ డీలా
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా రియల్టీ, ఐటీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.5 శాతం చొప్పున బలహీనపడగా.. మెటల్‌ 0.5 శాతం పుంజుకుంది. నిఫ్టీ దిగ్గజాలలో ఐబీ హౌసింగ్‌ 4.3 శాతం పతనంకాగా, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌ 3-1 శాతం మధ్య నీరసించాయి. అయితే వేదాంతా, గెయిల్‌, టాటా స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సన్‌ ఫార్మా, ఆర్‌ఐఎల్‌, ఇండస్‌ఇండ్‌ 1-0.5 శాతం మధ్య లాభపడ్డాయి. రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, డీఎల్‌ఎఫ్‌, బ్రిగేడ్‌ 3-1 శాతం మధ్య నీరసించాయి.

ఆర్‌కేపిటల్‌ డౌన్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో రిలయన్స్‌ కేపిటల్‌, ఇండియా సిమెంట్స్‌, సుజ్లాన్‌, జైన్‌ ఇరిగేషన్‌, బిర్లా సాఫ్ట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పిరమల్‌ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. కాగా.. మరోవైపు దివాన్‌, డిష్‌ టీవీ, మదర్‌సన్, పీసీ జ్యువెలర్స్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, జస్ట్‌డయల్‌, టొరంట్ ఫార్మా, టాటా పవర్‌, బాటా 4-1.6 శాతం మధ్య ఎగశాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైన నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.15 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 766 నష్టపోగా.. 646 లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఆప్టిమస్‌, విండ్‌సర్‌, ఈరోస్‌, ఐబీ ఇంటిగ్రే, సోరిల్‌, జెనిసిస్‌, తంగమాయిల్‌, ఎన్‌డీఎల్‌, జేఅండ్‌కే బ్యాంక్‌, క్రిధాన్‌, ప్రోజోన్‌, మన్‌పసంద్‌, రామ్‌కీ తదితరాలు 10-5 శాతం మధ్య పతనమయ్యాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');