ర్యాలీకి బ్రేక్‌- యూఎస్‌ ఫ్లాట్‌

ర్యాలీకి బ్రేక్‌- యూఎస్‌ ఫ్లాట్‌

వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం అలుపొచ్చింది. దీంతో గత ఆరు రోజుల్లో 1568 పాయింట్లు లాభపడిన డోజోన్స్‌ ఇండెక్స్‌ స్వల్ప వెనకడుగు వేసింది. ఈ బాటలో ఇటీవల 5 శాతం వరకూ లాభపడిన ఎస్‌అండ్‌పీ సైతం ఫ్లాట్‌గా ముగిసింది. వెరసి మంగళవారం డోజోన్స్‌ 14 పాయింట్లు(0.05 శాతం) క్షీణించి 26,048కు చేరగా.. ఎస్‌అండ్‌పీ నామమాత్రంగా 1 పాయింట్‌ నీరసించి 2,886 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ సైతం దాదాపు యథాతథంగా 7,822 వద్ద స్థిరపడింది. వచ్చే వారం ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ మరోసారి వడ్డీ రేట్ల పెంపు ఆలోచనను ట్విటర్‌ ద్వారా విమర్శించారు. 

జీ20పై దృష్టి
ఈ నెలలో జపాన్‌లో జరగనున్న జీ20 సదస్సుపై ఇన్వెస్టర్లు దృష్టిసారించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సదస్సులోనైనా అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలకు పరిష్కారం లభిస్తుందా అన్న అంశంపై ఇన్వెస్టర్లు ఆందోళనగా ఉన్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా.. మెక్సికన్‌ దిగుమతులపై టారిఫ్‌ల విధింపును ట్రంప్‌ విరమించుకోవడం, ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునివ్వడంతో గత 13 నెలల్లోలేని విధంగా డోజోన్స్‌ వరుసగా ఆరో రోజు లాభాలతో నిలిచిన సంగతి తెలిసిందే. సోమవారానికల్లా ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ సైతం రికార్డ్‌ గరిష్టానికి 2 శాతం చేరువలో నిలిచింది. 

రేథియాన్‌  డౌన్
ఎల్‌ఎంఈ ప్రవేశపెట్టనున్న లిథియం కొత్త కాంట్రాక్టులకు నోచెప్పడంతో అల్బెమర్లే స్టాక్ 3.5 శాతం జంప్‌చేయగా.. యునైటెడ్‌ టెక్నాలజీస్‌ 4 శాతం, రేథియాన్‌ 5 శాతం చొప్పున పతనమయ్యాయి. యునైటెడ్‌ టెక్నాలజీస్‌తో రేథియాన్‌ విలీనానికి బిలియనీర్‌ ఇన్వెస్టర్ విలియం అక్మన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం ఈ రెండు కౌంటర్లపైనా ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆసియా వీక్‌
మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.3-0.9 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. హాంకాంగ్‌, చైనా, ఇండొనేసియా, తైవాన్‌,  కొరియా1.6-0.3 శాతం మధ్య క్షీణించాయి. మిగిలిన మార్కెట్లలో సింగపూర్‌ స్వల్పంగా లాభపడగా.. థాయ్‌లాండ్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. జపాన్‌ యథాతథంగా కదులుతోంది. కాగా.. 10 ఏళ్ల యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 2.14 శాతం వద్ద నిలకడ చూపగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 96.70 వద్దే నిలిచింది. యూరో 0.5 శాతం బలపడి 1.132కు బలపడింది. జపనీస్‌ యెన్‌ 108.5కు బలపడింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');