జైన్‌ ఇరిగేషన్‌- హెస్టర్‌ -బీడీఎల్‌ జూమ్‌

జైన్‌ ఇరిగేషన్‌- హెస్టర్‌ -బీడీఎల్‌ జూమ్‌

వరుసగా ఆరు రోజులపాటు నేలచూపులకే పరిమితమైన అగ్రి ఎక్విప్‌మెంట్‌ సంస్థ జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌ బౌన్స్‌బ్యాక్‌ సాధించింది. పైపుల బిజినెస్‌ను విడదీసి విక్రయించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వెలువడిన వార్తలు ఇందుకు కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జైన్‌ ఇరిగేషన్‌ షేరు 9.5 శాతం దూసుకెళ్లింది. రూ. 41 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇంట్రాడేలో రూ. 35 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకడం గమనార్హం!

Related image

భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌
హెవీవెయిట్‌ టోర్పడోల సరఫరాకు దాదాపు రూ. 1188 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ పేర్కొంది. కాంట్రాక్టును 42 నెలల్లోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భారత్‌ డైనమిక్స్‌ షేరు 2.5 శాతం పెరిగి రూ. 293 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 303ను సైతం అధిగమించింది.

Image result for Hester bioscience limited

హెస్టర్‌ బయోసైన్సెస్‌
ఇటీవల ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న హెస్టర్‌ బయోసైన్సెస్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో ఎన్‌ఎస్ఈలో తొలుత ఈ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 1925ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 1.2 శాతం బలపడి రూ. 1905 వద్ద ట్రేడవుతోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 13342 కోట్లతో పరిశ్రమకు చేయూతనివ్వనున్నట్లు వెలువడిన వార్తలు సహకరించినట్లు నిపుణులు చెబుతున్నారు.Most Popular