ఈరోస్‌ పాతాళానికి- భెల్‌ భళా

ఈరోస్‌ పాతాళానికి- భెల్‌ భళా

ఇటీవల షేరు ధర పాతాళానికి చేరడంతో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా ప్రమోటర్లు అదనంగా తమ వాటాను తనఖాలో ఉంచవలసి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కౌంటర్లో ఐదో రోజూ అమ్మకాలు ఊపందుకోగా.. మరోవైపు న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐఎల్‌) నుంచి ఆర్డర్‌ లభించినట్లు వెల్లడించడంతో విద్యుత్‌ రంగ పీఎస్‌యూ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వివరాలు చూద్దాం..

ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ 
గత వారం రోజులుగా పతన బాటలో సాగుతున్న ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. కంపెనీ ప్రమోటర్లు జూన్‌ 6-10 మధ్యకాలంలో 48.4 లక్షల షేర్లను అదనంగా తనఖాలో ఉంచినట్లు వెల్లడికావడంతో ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలకు దిగారు. దీంతో ఈ కౌంటర్లో కొనేవాళ్లు కరవై 10 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం కుప్పకూలి రూ. 37 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. వరుసగా ఐదో రోజూ నేలచూపులకే పరిమితమైంది. గత ఐదు రోజులుగా ఈ కౌంటర్లో కొనుగోలుదారులు కరవుకావడంతో ఈ షేరు 45 శాతం దిగజారింది! కాగా.. ఏడాది కాలంలో ఈ షేరు 80 శాతం విలువను కోల్పోవడం గమనార్హం.

రేటింగ్‌ ఎఫెక్ట్‌
మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌కు చెందిన దీర్ఘకాలిక, స్వల్పకాలిక బ్యాంక్‌ సౌకర్యాల రేటింగ్‌ను డిఫాల్ట్‌(D)కు డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు కేర్‌ రేటింగ్స్‌ గత వారం పేర్కొంది. చెల్లింపుల్లో ఆలస్యం, రుణాల చెల్లింపుల సామర్థ్యం బలహీనపడటం వంటి ప్రతికూల అంశాల కారణంగా రేటింగ్‌ను డిఫాల్ట్‌గా సవరించినట్లు తెలియజేసింది. దీంతో కంపెనీ ఇకపై రుణ సమీకరణ చేపట్టడం కష్టసాధ్యంకావచ్చని విశ్లేషకులు తెలియజేశారు.

Related image

బీహెచ్‌ఈఎల్‌
పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌పీసీఐఎల్‌ నుంచి రూ. 440 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు బీహెచ్‌ఈఎల్‌ తాజాగా పేర్కొంది. తమిళనాడులోని కుందన్‌కుళమ్‌లో రెండు యూనిట్లతో కూడిన 2000 మెగావాట్ల న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఎరక్షన్‌ పనులకు కాంట్రాక్టు లభించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా రియాక్టర్‌సైడ్‌ పరికరాల సరఫరాకు సైతం ఆర్డర్ పొందినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బీహెచ్‌ఈఎల్‌ షేరు 2 శాతం లాభపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');