సెన్సెక్స్‌ అప్‌- మెటల్‌, బ్యాంక్స్‌ గుడ్‌

సెన్సెక్స్‌ అప్‌- మెటల్‌, బ్యాంక్స్‌ గుడ్‌

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో రెండో రోజూ సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతంసెన్సెక్స్‌ 152 పాయింట్లు ఎగసి 39,936కు చేరగా.. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 11,963 వద్ద కదులుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తొలుత జోరందుకున్న మార్కెట్లు తదుపరి స్వల్ప నష్టాలలోకి ప్రవేశించాయి. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు కన్సాలిడేట్‌ అవుతున్నట్లు నిపుణలు పేర్కొన్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,947-39760 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 11966-11904 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

రియల్టీ, ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, బ్యాంకింగ్‌, మీడియా, ఐటీ రంగాలు 0.5 శాతం చొప్పున బలపడగా.. రియల్టీ 0.5 శాతం బలహీనపడింది. నిఫ్టీ దిగ్గజాలలో జీ, యస్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా, హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా, ఇండస్‌ఇండ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, యూపీఎల్‌ 3.25-1.5 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 6 శాతం పతనంకాగా, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, ఐవోసీ 4-0.5 శాతం మధ్య క్షీణించాయి.

పీసీ జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో పీసీ జ్యువెలర్స్‌ 11 శాతం దూసుకెళ్లగా.. డిష్‌ టీవీ, జైన్‌ ఇరిగేషన్‌, ఇన్ఫీబీమ్‌, అరవింద్‌, అరబిందో ఫార్మా, బిర్లాసాఫ్ట్‌ 8-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జెట్‌ ఎయిర్‌వేస్‌ 10 శాతం పతనంకాగా.. ఉజ్జీవన్‌, ఎన్‌సీసీ, అజంతా ఫార్మా, రిలయన్స్ ఇన్ఫ్రా, చెన్నై పెట్రో, కేన్‌ఫిన్‌, సన్‌ టీవీ 6-2.5 శాతం మధ్య పతనమయ్యాయి.

మిడ్‌ క్యాప్స్‌ ప్లస్‌
మార్కెట్లు జోరుగా కదులుతున్న నేపథ్యంలో మిడ్‌ క్యాప్స్‌ వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకుంది. అయితే ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1305 నష్టపోగా.. 971 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. 



Most Popular