జెట్‌ ఎయిర్‌వేస్‌కు పిటిషన్ల షాక్‌

జెట్‌ ఎయిర్‌వేస్‌కు పిటిషన్ల షాక్‌

కంపెనీ పునరుద్ధరణకు వీలుగా మెజారిటీ వాటాను విక్రయించే ప్రణాళికలకు మరోసారి విఘాతం కలిగినట్లు వెలువడ్డ వార్తలు జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో వరుసగా ఏడో రోజూ అమ్మకాలకు తెరతీశాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో తొలుత జెట్ ఎయిర్‌వేస్‌ షేరు 14 శాతంవరకూ కుప్పకూలింది. రూ. 106కు చేరింది. ఇది దాదాపు దశాబ్ద కాలపు కనిష్టంకాగా.. ప్రస్తుతం 10 శాతం పతనంతో రూ. 112 వద్ద ట్రేడవుతోంది. గత కొద్ది రోజులుగా నష్టాల బాటలోనే కదులుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో సోమవారం సైతం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. వెరసి రెండు వారాలలోనే ఈ షేరు 30 శాతం దిగజారింది. 2009 మార్చిలో మాత్రమే జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ఈ స్థాయిలో ట్రేడయ్యింది. 

60 శాతం డౌన్‌
ఓవైపు నష్టాలు, మరోపక్క భారీ రుణభారంతో కార్యకలాపాలు సైతం నిలిచిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక పట్టాలెక్కకపోవచ్చన్న అంచనాలు జెట్ ఎయిర్‌వేస్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక కష్టాలలో చిక్కుకోవడంతో గత రెండు నెలలుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌లో అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు గత రెండు నెలల్లో 60 శాతంపైగా కోల్పోయింది. ఇతర వివరాలు చూద్దాం..

హిందుజా వెనక్కి
కంపెనీ కొనుగోలుకి ఇటీవల ఆసక్తి చూపుతూ వచ్చిన హిందుజా గ్రూప్‌ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో కలసి జెట్‌ ఎయిర్‌వేస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ముందుగా వేసుకున్న ప్రణాళికల నుంచి హిందుజా గ్రూప్‌ విరమించుకోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కంపెనీకి రుణాలిచ్చిన సంస్థలు ఇటీవల జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(NCLT) వద్ద దివాళా పిటిషన్‌ వేయడం, కంపెనీ కార్యకలాపాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు వంటి అంశాలు కొనుగోలుదారులకు అడ్డంకిగా నిలుస్తున్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌కు వ్యతిరేకంగా నమోదైన రెండు పిటిషన్లపై ఈ నెల 13 నుంచి విచారణ చేపట్టేందుకు ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');