జెన్సార్‌ టెక్‌ జూమ్‌- ఎవరెడీ డౌన్‌

జెన్సార్‌ టెక్‌ జూమ్‌- ఎవరెడీ డౌన్‌

విదేశీ టెక్‌ దిగ్గజం సిస్కోతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో సాఫ్ట్‌వేర్‌ సేవల మధ్యస్థాయి సంస్థ జెన్సార్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు ఆటుపోట్ల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతోంది. కాగా.. మరోపక్క షేరు రేటింగ్‌ను  ఇండియా రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం..

జెన్సార్‌ టెక్నాలజీస్‌
విదేశీ సంస్థలు నెట్‌యాప్‌, సిస్కోలతో గ్లోబల్‌ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వెల్లడించడంతో జెన్సార్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో జెన్సార్‌ టెక్నాలజీస్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 263 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 271 వరకూ ఎగసింది. ఫ్లెక్స్‌పాడ్‌ కన్వెర్జ్‌డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌డ్‌ ప్రయివేట్‌ క్లౌడ్‌ సేవలను అందించేందుకు నెట్‌యాప్‌, సిస్కోలతో చేతులు కలిపినట్లు జెన్సార్‌ పేర్కొంది. ఇందుకు వీలుగా నెట్‌యాప్‌ స్టోరేజీ, సిస్కో యూసీఎస్‌ నెట్‌వర్కింగ్ రీసోర్సెస్‌ను వినియోగించుకోనున్నట్లు తెలియజేసింది. తాము అభివృద్ధి చేసిన విన్సీ స్మార్ట్‌ అటానమిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా కస్టమర్లకు పలు ఫీచర్లు కలిగిన ప్రయివేట్‌ క్లౌడ్‌ సేవలను అందించనున్నట్లు వివరించింది.

Image result for eveready industries

ఎవరెడీ ఇండస్ట్రీస్‌
ఎవరెడీ ఇండస్ట్రీస్‌కు చెందిన దీర్ఘకాలిక క్రెడిట్‌ రేటింగ్‌ను A+ నుంచి BBBకు  ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్ సంస్థ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అంతేకాకుండా ప్రతికూల రేటింగ్‌ వాచ్‌ను ప్రకటించింది. ఈ బాటలో కంపెనీ కమర్షియల్‌ పేపర్‌ రేటింగ్‌ను సైతం ప్రతికూల రేటింగ్‌ వాచ్‌తో కూడిన A2గా సవరించింది. బలహీన లిక్విడిటీ పరిస్థితులు, రుణాలు పెరగడం వంటి అంశాలను రేటింగ్‌ సమీక్షలో పరిగణించినట్లు ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఎవరెడీ ఇండస్ట్రీస్‌ షేరు 2.3 శాతం క్షీణించి రూ. 89 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 86.5 వరకూ నీరసించింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');