స్టెరిలైట్‌ లాభాల వేవ్స్‌- సన్‌ ఫార్మా వీక్

స్టెరిలైట్‌ లాభాల వేవ్స్‌- సన్‌ ఫార్మా వీక్

తనఖాలో ఉంచిన మొత్తం వాటాను ప్రమోటర్లు విడిపించుకున్నట్లు తెలియజేయడంతో ఆప్టికల్ ఫైబర్‌, కమ్యూనికేషన్స్‌ సేవల సంస్థ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ కౌంటర్‌ ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా.. మరోపక్క విదేశీ రీసెర్చ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో దేశీ హెల్త్‌కేర్ దిగ్గజం సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. వివరాలు చూద్దాం...

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌
కంపెనీ ప్రమోటర్ల సంస్థ ట్విన్‌ స్టార్‌ ఓవర్‌సీస్‌ తనఖాలో ఉంచిన మొత్తం వాటాను తిరిగి సొంతం చేసుకున్నట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ తాజాగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ప్లెడ్జ్‌ చేసిన మొత్తం వాటాను విడిపించుకున్నట్లు తెలియజేసింది. ఈ సందర్భంగా స్టెరిలైట్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ గ్లోబల్‌ డేటా నెట్‌వర్క్స్‌కు కంపెనీ అందిస్తున్న కొత్తతరహా టెక్నాలజీ సొల్యూషన్స్‌పట్ల తానెంతో ఉత్సుకతగా ఉన్నట్లు పేర్కొన్నారు. తమతోపాటు.. కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన పలువురు ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో వాటాదారుల విలువ మెరుగుపడే అంశంలో ఎంతో ఆశావహంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ షేరు 9.5 శాతం దూసుకెళ్లి రూ. 190 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 194 వరకూ ఎగసింది.

Image result for sun pharmaceutical industries ltd

సన్‌ ఫార్మాస్యూటికల్‌
షేరు రేటింగ్‌ను తటస్థం(న్యూట్రల్‌) నుంచి విక్రయించవచ్చు(సెల్‌)నంటూ విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజాగా సవరించడంతో సన్‌ ఫార్మాస్యూటికల్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. షేరు టార్గెట్‌ ధరను సైతం రూ. 437 నుంచి రూ. 355కు కుదించింది. కంపెనీకి కీలకమైన బిజినెస్‌ విభాగాలలో పోటీ కారణంగా లాభదాయకత మందగించవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో సన్‌ ఫార్మాస్యూటికల్‌ షేరు 4 శాతం పతనమై రూ. 387 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 384 వరకూ నీరసించింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');