మార్కెట్‌ ఓకే- ఐటీ, మెటల్‌ అండ

మార్కెట్‌ ఓకే- ఐటీ, మెటల్‌ అండ

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ చేసింది. 39,927 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. తదుపరి ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం 15 పాయింట్ల నామమాత్ర లాభంతో 39,800 వద్ద ట్రేడవుతోంది. కాగా.. తొలుత 11,969 వరకూ ఎగసిన నిఫ్టీ ప్రస్తుతం 9 పాయింట్లు నీరసించి 11,913 వద్ద కదులుతోంది. అమెరికా నుంచి ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు బలపడటంతో దేశీయంగానూ తొలుత ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

రియల్టీ, ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ, మెటల్‌ రంగాలు 0.5 శాతం చొప్పున బలపడగా.. ఫార్మా, రియల్టీ 0.7 శాతం చొప్పున బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, కోల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌ 2-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐబీ హౌసింగ్‌ 5.3 శాతం పతనంకాగా, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఅండ్‌ఎం, గెయిల్‌,  ఎయిర్‌టెల్‌, జీ, హిందాల్కో, సిప్లా, యూపీఎల్‌ 2.4-0.5 శాతం మధ్య క్షీణించాయి.

జెట్‌ ఎయిర్‌ వీక్‌
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో భారత్ ఫైనాన్స్‌, ఇన్ఫీబీమ్‌, బిర్లాసాఫ్ట్‌, అపోలో హాస్పిటల్స్‌ 2.5-1 శాతం మధ్య పుంజుకోగా.. జెట్‌ ఎయిర్‌వేస్‌, పీసీ జ్యువెలర్స్‌, ఆర్‌పవర్, సుజ్లాన్‌, జైన్‌ ఇరిగేషన్‌, కేన్‌ఫిన్‌, ఐసీఐసీఐ ప్రు, రిలయన్స్ కేపిటల్‌ 9-2.5 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు డౌన్‌
మార్కెట్లు జోరుగా ప్రారంభమై కాస్త వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 690 నష్టపోగా.. 518 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో విండ్‌సర్‌ 20 శాతం కుప్పకూలగా.. కెల్టన్‌ టెక్‌, ఈరోస్‌, ఐబీ ఇంటిగ్రే, సోరిల్‌, ఐబీ వెంచర్స్‌, విపుల్‌, దీపక్‌ నైట్రేట్‌, లక్ష్మీవిలాస్‌, ఐబీ రియల్టీ, డెక్కన్‌ గోల్డ్‌, 63మూన్స్‌, మన్‌పసంద్‌ తదితరాలు 9-5 శాతం మధ్య పతనమయ్యాయి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');