డోజోన్స్‌ జోరు- ఆరో రోజూ అప్‌

డోజోన్స్‌ జోరు- ఆరో రోజూ అప్‌

మెక్సికన్‌ దిగుమతులపై టారిఫ్‌ల విధింపును విరమించుకోవడం, ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లకు హుషారునివ్వడంతో సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. ఫలితంగా గత 13 నెలల్లోలేని విధంగా డోజోన్స్‌ వరుసగా ఆరో రోజు లాభాలతో నిలిచింది. మరోపక్క చిప్‌ దిగ్గజాలు, ఇతర బ్లూచిప్స్‌ అండతో నాస్‌డాక్‌ జోరు చూపుతోంది. వెరసి సోమవారం డోజోన్స్‌ 79 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 26,063కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 13 పాయింట్లు(0.5 శాతం) బలపడి 2,887 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 81 పాయింట్లు(1.05 శాతం) జంప్‌చేసి 7,823 వద్ద స్థిరపడింది. దీంతో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ రికార్డ్‌ గరిష్టానికి 2 శాతం చేరువలో నిలిచింది. మధ్యఅమెరికాలో వలసలను అడ్డుకునే చర్యలను చేపట్టనున్నట్లు ప్రకటించడంతో మెక్సికో దిగుమతులపై సోమవారం నుంచి 5 శాతం టారిఫ్‌ల విధింపు యోచనను ట్రంప్‌ ప్రభుత్వం విరమించుకుంది. దీంతో సెంటిమెంటుబలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

డీల్‌ పుష్‌
డిఫెన్స్‌ కాంట్రాక్టుల సంస్థ రేథియాన్‌తో ఏరోస్పేస్‌ బిజినెస్‌ను విలీనం చేసేందుకు ఇంజినీరింగ్ దిగ్గజం యునైటెడ్‌ టెక్నాలజీస్‌ అంగీకరించింది. తద్వారా 121 బిలియన్‌ డాలర్ల విలువైన కొత్త సంస్థ ఆవిర్భవించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఈ విలీనం వల్ల పోటీకి తెరపడుతుందని ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించడంతో యునైటెడ్‌ టెక్నాలజీస్‌ షేరు 3 శాతం పతనమైంది. రేథియాన్‌ స్వల్పంగా 1 శాతం పుంజుకుంది. కాగా.. డేటా సేవల సంస్థ ట్యాబ్లూ సాఫ్ట్‌వేర్‌ను 15.3 బిలియన్‌ డాలర్లతో టేకోవర్‌ చేయనున్నట్లు ప్రకటించడంతో సేల్స్‌ఫోర్స్‌.కామ్‌ కౌంటర్లో అమ్మకాలు పెరిగాయి. దీంతో సేల్స్‌ఫోర్స్‌ షేరు 5.3 శాతం పతనంకాగా.. ట్యాబ్లూ 34 శాతం దూసుకెళ్లింది. మెక్సికో రిలీఫ్‌ నేపథ్యంలో జనరల్‌ మోటార్స్‌, కాన్‌స్టిలేషన్‌ బ్రాండ్స్‌ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి.

ఆసియా, యూరప్‌ ప్లస్‌
సోమవారం యూరోపియన్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. జర్మనీ, యూకే, ఫ్రాన్స్‌ 0.5 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, సింగపూర్‌, జపాన్‌, కొరియా 1.6-0.3 శాతం మధ్య ఎగశాయి. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా, థాయ్‌లాండ్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. కాగా.. వారాంతాన 2.05 శాతానికి నీరసించిన 10 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 2.14 శాతానికి పెరిగాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 96.73కు బలహీనపడగా.. యూరో 0.5 శాతం బలపడి 1.138కు బలపడింది. జపనీస్‌ యెన్‌ 108.38 వద్ద స్థిరంగా కదులుతోంది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');