ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (జూన్ 11)

ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.. (జూన్ 11)
 • ఆధార్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌లో మొత్తం 9.15 శాతం వాటాను బ్లాక్‌స్టోన్‌ అనుబంధ సంస్థకు విక్రయించిన DHFL
 • వ్యక్తిగత కారణాలతో యెస్‌ బ్యాంక్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ రాజీనామా
 • సింగపూర్‌లో ప్రీమియం మిల్క్‌ బ్రాండ్‌ను ప్రారంభించిన పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌
 • షేర్ల బైబ్యాక్‌కు ఈనెల 20వ తేదీని రికార్డ్‌ డేట్‌గా నిర్ణయించిన SH కేల్కర్‌
 • రైట్స్‌ ఇష్యూపై నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 13న సమావేశం కానున్న టాటా స్పాంజ్‌ ఐరన్‌
 • ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, భారత్‌ ఫైనాన్షియల్‌ విలీనానికి NCLT అనుమతి
 • BHEL నుంచి రూ.47.2 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకున్న RPP ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌
 • అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కర్నూలు ఇంటిగ్రేటెడ్‌ సిమెంట్‌ ప్లాంట్‌కు లైన్‌క్లియర్‌
 • రూ.2500 కోట్లతో నెలకొల్పే ఈ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు పొందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌
 • న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో షేర్‌హోల్డర్ల నుంచి రూ.139 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయబోతోన్న ఎరోస్‌ ఇంటర్నేషనల్‌
 • దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు పెద్ద ఆర్డర్లను దక్కించుకున్న ఎల్‌అండ్‌టీ
 • జేపీ ఇన్‌ఫ్రాను కొనుగోలు చేసేందుకు ఎన్‌బీసీసీ చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఓటు వేసేందుకు రుణదాతలకు అవకాశం ఉందన్న NCLAT
 • గతనెల్లో వాహన ఉత్పత్తిని 18.1శాతం తగ్గించిన మారుతీ సుజుకీ
 • J&K బ్యాంక్‌ కొత్త తాత్కాలిక సీఎండీగా ఆర్‌కే ఛిబ్బెర్‌ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం
 • J&K బ్యాంక్‌ తాత్కాలిక సీఎండీగా 3 నెలల పాటు కొనసాగనున్న ఆర్‌కే ఛిబ్బెర్‌
 • మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎస్‌పీవీ విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించడానికి రూ.520 కోట్ల ఆర్డర్లు దక్కించుకున్న BHEL
 • సాంప్రదాయక దుస్తుల మార్కెట్లోకి ప్రవేశించనున్న ఆదిత్యా బిర్తా ఫ్యాషన్‌
 • రూ.110 కోట్లకు జేపోర్‌ అండ్‌ టీజీ అప్పరెల్‌ అండ్‌ డెకోర్‌ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిన ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌
 • 30-45 రోజుల్లో కొనుగోలు ఒప్పందం పూర్తి కానున్నట్టు అంచనా వేస్తోన్న ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌