ఐటీ, ఎఫ్‌ఎంసీజీ దన్ను- లాభాల ముగింపు

ఐటీ, ఎఫ్‌ఎంసీజీ దన్ను- లాభాల ముగింపు

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరివరకూ సానుకూలంగానే కదిలాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అయితే ట్రిపుల్‌ సెంచరీతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ముగిసేసరికి 168 పాయింట్లు పెరిగి 39,784 వద్ద నిలిచింది. ఈ బాటలో తొలుత 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన నిఫ్టీ సైతం చివరికి 52 పాయింట్లు బలపడి 11,923 వద్ద స్థిరపడింది. అమెరికా నుంచి ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు జోరందుకోవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లకు ఎగబడటంతో స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. 

పీఎస్‌యూ బ్యాంక్స్‌ డౌన్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, ఐటీ 1.4 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా,  పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, ఎయిర్‌టెల్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.5-1.5 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్, కోల్‌ ఇండియా, గెయిల్‌, ఐవోసీ, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ, జీ, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ 3.3-1 శాతం మధ్య క్షీణించాయి.

దివాన్‌ జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివాన్‌ హౌసింగ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, మహానగర్‌ గ్యాస్‌, మదర్‌సన్, మణప్పురం, స్టార్‌, బాటా ఇండియా, జూబిలెంట్‌ ఫుడ్‌, హెక్సావేర్‌ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క జైన్‌ ఇరిగేషన్‌, పీసీ జ్యువెలర్స్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, సుజ్లాన్‌, ఆర్‌పవర్‌, రిలయన్స్ కేపిటల్‌, ఇన్ఫీబీమ్‌, డిష్‌ టీవీ, ఐడియా, టాటా కమ్యూనికేషన్స్‌14-4 శాతం మధ్య పతనమయ్యాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు లాభాలతో ముగిసినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలు పైచేయి సాధించాయి. దీంతో బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం నీరసించింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1622 నష్టపోగా.. 984 మాత్రమే లాభాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 479 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 180 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. కాగా గత గురువారం ఎఫ్‌పీఐలు రూ. 1449 కోట్లు, డీఐఐలు రూ. 651 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');