టాప్ బ్రోకరేజ్ సంస్థల చూపు ఈ స్టాక్స్ పైనే..! మీ వద్ద ఉన్నాయా? 

టాప్ బ్రోకరేజ్ సంస్థల చూపు ఈ స్టాక్స్ పైనే..! మీ వద్ద ఉన్నాయా? 

ఈ నెల ఆరంభంలో ఆర్బీఐ రెపో రేట్ల సమీక్ష ఫలితాలు వెల్లడి కాగానే ఒక్కసారిగా దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం, కీలక వడ్డీ రేట్లు 5.75శాతానికి పరిమితం కావడంతో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్  నష్టాల్లోకి వెళ్ళిపోయింది. కానీ.. ప్రముఖ బ్రోకింగ్ కంపెనీల అంచనాల మేరకు కొన్ని స్టాక్స్ మీడియం టర్మ్ కోసం లాభాల దిశగా పయనించనున్నట్టు అవి పేర్కొంటున్నాయి. ఈ స్టాక్స్ 16-50 శాతం వరకూ రిటర్న్స్ అందించనున్నాయని ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అవేంటో చూద్దామా...!

1. ఇన్ఫీబీమ్ అవెన్యూస్ : బ్రోకరేజ్ సంస్థ KR చోక్సీ: రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 45.05: టార్గెట్ ప్రైస్ రూ. 63: వృద్ధి అంచనా  40 శాతం 
2. సద్భావ్ ఇంజనీరింగ్ : బ్రోకరేజ్ సంస్థ ICICI డైరెక్ట్ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 253.20: టార్గెట్ ప్రైస్ రూ. 300: వృద్ధి అంచనా  18 శాతం
3. ఎంటర్‌టైన్మెంట్ నెట్‌వర్క్ : బ్రోకరేజ్ సంస్థ HDFC సెక్యూరిటీస్ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 461.25: టార్గెట్ ప్రైస్ రూ. 696: వృద్ధి అంచనా  50 శాతం  
4. ONGC : బ్రోకరేజ్ సంస్థ ఎలారా క్యాపిటల్ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 169.05: టార్గెట్ ప్రైస్ రూ. 226: వృద్ధి అంచనా  33 శాతం 
5. గ్రిండ్ వెల్ నార్టన్ : బ్రోకరేజ్ సంస్థ ICICI డైరెక్ట్ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 582.80 : టార్గెట్ ప్రైస్ రూ. 680 : వృద్ధి అంచనా 16 శాతం 
6. భారతీ ఎయిర్ టెల్ : బ్రోకరేజ్ సంస్థ ఎలారా క్యాపిటల్ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 353.80: టార్గెట్ ప్రైస్ రూ. 530 : వృద్ధి అంచనా  50 శాతం 
7. ఆల్కెమ్ ల్యాబరేటరీస్ : బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ. 1,765.05: టార్గెట్ ప్రైస్ రూ. 2,089 : వృద్ధి అంచనా  18 శాతం
8. మయూర్ యూనీక్వోటర్స్ : బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాఠీ : రేటింగ్ "బై": ప్రస్తుత ధర రూ.298.25 : టార్గెట్ ప్రైస్ రూ. 396 : వృద్ధి అంచనా  32 శాతం