యస్‌ బ్యాంక్‌ -వీడని కష్టాలు

యస్‌ బ్యాంక్‌ -వీడని కష్టాలు

గత కొద్ది రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ మరోసారి డీలాపడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ప్రాధాన్యమివ్వడంతో లాభాల మార్కెట్లోనూ నష్టాలతో కళతప్పింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 4 శాతం పతనమై రూ. 135 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 133 దిగువకు  చేరింది. వెరసి వరుసగా మూడో రోజు నేలచూపులతో కదులుతోంది. ఇది మూడేళ్ల కనిష్టంకాగా.. ఇంతక్రితం 2016 ఫిబ్రవరిలో మాత్రమే యస్‌ బ్యాంక్‌ షేరు ఈ స్థాయిలో ట్రేడయ్యింది. 

కారణాలున్నాయ్‌..
మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) పెరగడం, బ్యాలన్స్‌షీట్ బలహీనపడుతుండటం, పెట్టుబడుల సమీకరణ మందగించడం వంటి ప్రతికూలతల కారణంగా ఇటీవల యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ నీరసిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో ఈ షేరు 12 శాతం క్షీణించింది. ఏప్రిల్‌ 26 నుంచి చూస్తే నెలన్నర రోజుల్లో 44 శాతం పతనమైంది. రూ. 237 స్థాయి నుంచి రూ. 135కు తిరోగమించింది. ఇందుకు గతేడాది(2018-19) చివరి త్రైమాసికం(జనవరి-మార్చి)లో తొలిసారి రూ. 1506 కోట్ల నికర నష్టం ప్రకటించింది. దీనికితోడు గత కొంతకాలంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలకు రూ. 13,000 కోట్ల రుణాలందించడం కూడా షేరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో యస్‌ బ్యాంక్‌ షేరుకి రూ. 124 టార్గెట్‌ ధరతో దేశీ బ్రోకింగ్‌ సంస్థ ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సెల్‌ రేటింగ్‌ను ప్రకటించింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');