పీసీ జ్యువెలర్స్‌కు రేటింగ్ దెబ్బ

పీసీ జ్యువెలర్స్‌కు రేటింగ్ దెబ్బ

ఇటీవల కొంతకాలంగా క్షీణపథంలో కదులుతున్న పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇందుకు ప్రధానంగా కంపెనీ బ్యాంకు రుణ సౌకర్యాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రేటింగ్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం కారణమైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. పీసీ జ్యువెలర్స్‌ రుణ చెల్లింపుల సామర్థ్యాన్ని రేటింగ్‌ దిగ్గజాలు క్రిసిల్‌, కేర్‌.. తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కంపెనీ బ్యాంకు సౌకర్యాలను BBB+ నుంచి క్రిసిల్‌.. BB+ నెగిటివ్‌(ప్రతికూలం)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. మరోవైపు కంపెనీ డిపాజిట్ల రేటింగ్‌ను కేర్‌ సైతం BB+కు సవరించింది.

షేరు పతనం
బ్యాంకు సౌకర్యాలు, ఆభరణాల కొనుగోలు డిపాజిట్ల పథకాల రేటింగ్స్‌ను క్రిసిల్‌, కేర్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీసీ జ్యువెలర్స్‌ షేరు 9 శాతం పతనమై రూ. 57 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 55.5 వరకూ దిగజారింది. పీసీజే గ్రూప్‌ నిర్వహణ స్థాయిలో నమోదుచేస్తున్న నష్టాలు రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌పై ప్రభావం చూపినట్లు క్రిసిల్‌, కేర్‌ పేర్కొన్నాయి. ఎగుమతి కస్టమర్లకు కంపెనీ అనుకోని విధంగా ఇచ్చిన రూ. 513 కోట్లమేర డిస్కౌంట్‌ను ఈ అంశంలో పరిగణించినట్లు క్రిసిల్‌ తెలియజేసింది. tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');