ఈ 2-3 వారాల్లో లాభాలు పంచే స్టాక్స్ ఇవే...!

ఈ 2-3 వారాల్లో లాభాలు పంచే స్టాక్స్ ఇవే...!

దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి సోమవారం నాడు మంచి సానుకూల ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి. అమెరికన్ ఫెడ్ రేట్లు తగ్గడం, మెక్సికన్ వివాదంపై అమెరికా వెనక్కి తగ్గడం, అమెరికాలో ఉద్యోగ అవకాశాలు పెరగడం వంటి అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ 360 పాయింట్లు జంప్ చేసింది. ప్రారంభ డీల్స్ లోనే IT, బ్యాంకింగ్, మెటల్ , FMCG కౌంటర్లు కొనుగోళ్ళ మద్దతును సంపాదించాయి. మదుపర్లకు కొనుగోళ్ళ ఆసక్తిని పెంచాయి. ఈ ర్యాలీ కొంత అస్థిరంగా ఉన్నప్పటికీ.. లాభాల స్వీకరణకు మొగ్గు చూపితే తిరిగి బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో జారుకునే అవకాశం లేకపోలేదని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. కానీ.. అత్యధిక బ్రోకరేజ్ సంస్థలు, ఎనలిస్టుల అంచనాల ప్రకారం రానున్న రెండు , మూడు వారాల్లో ఓ 10 స్టాక్స్ మంచి లాభాలను చూపిస్తాయని వారు పేర్కొంటున్నారు. అవేంటో చూద్దామా..!
రిలయన్స్ సెక్యూరిటీస్ అంచనాలు 
1. బాల కృష్ణ ఇండస్ట్రీస్ : బై : టార్గెట్ ప్రైస్ రూ. 865: స్టాప్ లాస్ రూ. 745
2. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్స్ : బై : టార్గెట్ ప్రైస్ రూ. 272: స్టాప్ లాస్ రూ. 224

ఏంజిల్ బ్రోకింగ్ అంచనాలు
3. CESC : బై : టార్గెట్ ప్రైస్ రూ. 825 : స్టాప్ లాస్ రూ. 738
ఎస్ సెక్యూరిటీస్ అంచనాలు 
4. సూవెన్ లైఫ్ సైన్సెస్ : బై : టార్గెట్ ప్రైస్ రూ. 295-305 : స్టాప్ లాస్ రూ. 255
5. VIP ఇండస్ట్రీస్ ; బై : టార్గెట్ ప్రైస్ రూ. 490-510 : స్టాప్ లాస్ రూ. 430

HDFC సెక్యూరిటీస్ అంచనాలు
6. V-గార్డ్ ఇండస్ట్రీస్ ; బై : టార్గెట్ ప్రైస్ రూ. 296 : స్టాప్ లాస్ రూ. 218
7. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ : బై : టార్గెట్ ప్రైస్ రూ. 537: స్టాప్ లాస్ రూ. 485

ప్రభుదాస్ లీలాధర్ బ్రోకింగ్ అంచనాలు 
8. వోల్టాస్ : బై: టార్గెట్ ప్రైస్ రూ. 670: స్టాప్ లాస్ రూ. 580
ఛార్ట్ వ్యూ ఇండియా .ఇన్ అంచనాలు 
9. టెక్ మహీంద్ర: బై : టార్గెట్ ప్రైస్ రూ. 790 : స్టాప్ లాస్ రూ. 725
10. SRF : బై : టార్గెట్ ప్రైస్ రూ. 3,100 : స్టాప్ లాస్ రూ. 2,800


Disclaimer: పైన పేర్కొన్న అంచనాలు బ్రోకింగ్ సంస్థలు, ప్రముఖ ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.