మార్కెట్‌ ఓకే- పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

మార్కెట్‌ ఓకే- పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేశాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రారంభంలోనే లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 115 పాయింట్లు పెరిగి 39,731 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో తొలుత 11,975 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన నిఫ్టీ సైతం ప్రస్తుతం 30 పాయింట్లు బలపడి 11,900 వద్ద కదులుతోంది. అమెరికా నుంచి ఆసియా వరకూ స్టాక్‌ మార్కెట్లు జోరందుకోవడంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొనుగోళ్లకు ఎగబడటంతో స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. 

బ్లూచిప్స్‌ జోరు
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, ఐటీ 1.2 శాతం చొప్పున పుంజుకోగా.. మీడియా,  పీఎస్‌యూ బ్యాంక్స్‌ 2-1 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, బ్రిటానియా, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్ ఫార్మా, బజాజ్‌ ఫిన్‌ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్‌లో బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్, జీ, కోల్‌ ఇండియా, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ 3-0.5 శాతం మధ్య క్షీణించాయి.

దివాన్‌ జోరు
ఎఫ్‌అండ్‌వో స్టాక్స్‌లో దివాన్‌ హౌసింగ్‌, మణప్పురం, యూబీఎల్‌, మదర్‌సన్, ముత్తూట్‌, పిడిలైట్‌, బాటా ఇండియా, హెక్సావేర్‌ 5.4-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఆర్‌పవర్‌, రిలయన్స్ ఇన్‌ఫ్రా, రిలయన్స్ కేపిటల్‌, డిష్‌ టీవీ, జైన్‌ ఇరిగేషన్, పీసీ జ్యువెలర్స్‌, ఇన్‌ఫీబీమ్‌, టీవీ 18, సుజ్లాన్‌ 15-3 శాతం మధ్య కుప్పకూలాయి.

చిన్న షేర్లు వీక్‌
మార్కెట్లు జోరుగా ప్రారంభమై కాస్త వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో చిన్న షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1340 నష్టపోగా.. 930 మాత్రమే లాభాలతో కదులుతున్నాయి. స్మాల్‌ క్యాప్స్‌లో ఆప్టిమస్‌, విండ్‌సర్‌ 20 శాతం కుప్పకూలగా.. జేఅండ్‌కే బ్యాంక్‌, ఈరోస్‌, మెక్‌లాయిడ్‌, రిలయన్స్‌ హోమ్‌, యుఫో, దీపక్‌ నైట్రేట్‌, ఐజీపీఎల్‌ తదితరాలు 16-6.5 శాతం మధ్య పతనమయ్యాయి.



Most Popular