4వ త్రైమాసికంలో ప్రభావం చూపిన నిఫ్టీ 100లోని స్టాక్స్ ఇవే...! మీ దగ్గరున్నాయా?

4వ త్రైమాసికంలో ప్రభావం చూపిన నిఫ్టీ 100లోని స్టాక్స్ ఇవే...! మీ దగ్గరున్నాయా?

దేశీయ మార్కెట్లలో నిఫ్టీకి చెందిన కంపెనీల్లో లాభదాయకత ఉన్నప్పటికీ గత మార్చ్ క్వార్టర్‌ నాటికి ప్రాఫిట్స్‌లో డబుల్ డిజిట్స్ నమోదు చేయలేక పోయాయి. అయినప్పటికీ ఈ స్టాక్స్ మీద ఎనలిస్టుల అంచనాలు మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి నిఫ్టీ 100లోని దాదాపు 17 స్టాక్స్ మంచి ప్రభావశీలంగా ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు.  డిమాండ్ తగ్గడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నగదు లిక్విడిటీ కొరత, గ్లోబల్ ట్రేడ్ వార్లు  మార్కెట్ల వృద్ధి గమనంలో అడ్డుకట్టగా మారాయి. గత నాలుగో త్రైమాసిక ఫలితాల తరువాత చాలా బ్రోకరేజ్ సంస్థలు నిఫ్టీ కంపెనీల EPS (ఎర్నింగ్స్ పర్ షేర్ ) ను తగ్గించాయి. 2020 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఎనర్జీ, మెటల్స్, టెలీ కామ్ రంగాల్లో  ఎలారా క్యాపిటల్ సంస్థ నిఫ్టీ EPS ను  రూ. 612గా తగ్గించింది. అలాగే 2021 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఎర్నింగ్స్ పర్ షేర్ వాల్యూ  రూ. 735 గా నిర్ణయించింది. 
అయితే ప్రస్తుత మార్కెట్ల స్థితిగతులను పరిశీలిస్తే... FY20 ఆర్ధిక సంవత్సరం EPS  25శాతం గ్రోత్‌తో కనబడుతుంది (FY19 తో పోలిస్తే..). అంతే కాకుండా బ్యాంకులు, సిమెంట్ , టెలికాం రంగాల్లో అధిక లాభదాయకత పెరగడం కూడా సానుకూల అంశంగా మారింది. నిఫ్టీ లోని చాలా కంపెనీల EPS రేషియో మెరుగు పడుతుండటం గమనార్హం. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిఫ్టీ100లోని ఓ 17 కంపెనీల స్టాక్స్ రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలను చూపిస్తాయని ఎలారా క్యాపిటల్స్ అంచనా వేస్తోంది. వీటిలో HCL టెక్, DLF, టెక్ మహీంద్ర, ITC, HPCL, BPCL, విప్రో, అదానీ పోర్ట్స్ , DRL, బజాజ్ ఫిన్ , కోల్ ఇండియా, M&M వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. 

eps-stocks
దీర్ఘకాలిక పెట్టుబడులు విషయంలో నిఫ్టీ స్టాక్స్ మంచి ప్రాఫిట్స్ ను అందించగలవని మోతీలాల్ ఓశ్వాల్ బ్రోకరేజ్ సంస్థ పేర్కొంది. ROCE, క్యాష్ ఫ్లో, EBITA మార్జిన్లు, లీవరేజ్ రేషియో వంటివి కంపెనీ స్టాక్స్ మీద ప్రభావం చూపిస్తాయని, దీర్ఘకాలిక మదుపర్లకు ఇవి లాభాలను తీసుకొస్తాయని మోతీలాల్ ఓశ్వాల్ అంచనా వేస్తోంది. 2-3 ఏళ్ళ కాలానికి గానూ సిమెంట్, టెలికాం, బ్యాంకింగ్ సెక్టార్లు రానున్న రోజుల్లో అత్యధిక లాభాలను తీసుకొస్తాయని బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. 
Disclaimer: పైన పేర్కొన్న అంచనాలు ఎనలిస్టులు, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');