రాకేష్‌.. ఎల్‌ఐసీ- తప్పలేదు దివాన్‌ షాక్‌

రాకేష్‌.. ఎల్‌ఐసీ- తప్పలేదు దివాన్‌ షాక్‌

గత కొంత కాలంగా లిక్విడిటీ సమస్యలతో పతన బాటలో సాగుతున్న ఎన్‌బీఎఫ్‌సీ షేరు దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌.. అటు ఇన్వెస్టర్లకు, ఇటు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకూ షాక్‌నిస్తోంది. దీంతో కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా సంస్థ ఏస్‌ ఈక్విటీ ఓవైపు.. బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ మరోపక్క.. పెట్టుబడుల క్షీణతను చవిచూస్తుండటం గమనించదగ్గ అంశం! ఇప్పటికే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ సంక్షోభం కారణంగా పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు సైతం పెట్టుబడుల విషయంలో దెబ్బతిన్న విషయం విదితమే. ఇతర వివరాలు చూద్దాం..

క్యూ4లోనూ ఇన్వెస్ట్‌మెంట్స్‌
గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో రాకేష్‌ వాటాను పెంచుకున్నారు. క్యూ4(జనవరి-మార్చి)లో దివాన్‌ హౌసింగ్‌లో రాకేష్ సంస్థ ఏస్‌ ఈక్విటీకు గల వాటా 73 బేసిస్‌ పాయింట్లమేర పెరిగింది. దీంతో దివాన్‌ కంపెనీలో ఏస్‌ వాటా 3.19 శాతానికి చేరింది. మార్చి 29కల్లా దివాన్‌ షేరు మార్కెట్‌ ధర ప్రకారం ఈ వాటా విలువ సుమారు రూ. 150 కోట్లు. మరోవైపు పీఎస్‌యూ సంస్థ ఎల్‌ఐసీ సైతం క్యూ4కల్లా దివాన్‌ హౌసింగ్‌లో 3.44 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వాటా విలువ రూ. 162 కోట్లకుపైమాటే.  

Related image

క్షీణ పథంలో
లిక్విడిటీ సమస్యలతో ఇటీవల కొంత కాలంగా దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ షేరు పతనబాటలో సాగుతూ వస్తోంది. తాజాగా ఎన్‌ఎస్ఈలో 7.3 శాతం దిగజారి రూ. 87 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 86 దిగువన సరికొత్త కనిష్టాన్ని చవిచూసింది కూడా. కాగా.. మార్చి 29న దివాన్‌ హౌసింగ్‌ షేరు ధర రూ. 150 సమీపంలో ట్రేడయ్యింది. తదుపరి ఈ షేరు క్షీణ పథంలో పయనిస్తూ.. గురువారానికల్లా(జూన్‌ 6) రూ. 93కు చేరింది. ఈ ధరతో చూస్తే దివాన్‌ హౌసింగ్‌లో ఏస్‌ ఈక్విటీకి గల వాటా విలువ ప్రస్తుతం రూ. 94 కోట్లకు చేరినట్లు నిపుణులు పేర్కొంటున్నారు! ఇక ఎల్‌ఐసీ వాటా విలువ సైతం రూ. 101 కోట్ల సమీపానికి క్షీణించింది! వెరసి పెట్టుబడి విలువలో 38 శాతం ఆవిరైంది! కాగా.. దివాన్‌ హౌసింగ్‌లో 3 శాతానికిపైగా వాటా కలిగి ఉండటం ద్వారా ఏస్‌ ఈక్విటీ, ఎల్‌ఐసీ అతిపెద్ద వాటాదారులుగా నిలుస్తుండటం ప్రస్తావించదగ్గ అంశం.
(source: Business standard)tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');