పాతాళానికి దివాన్‌ హౌసింగ్‌.. గెయిల్‌

పాతాళానికి దివాన్‌ హౌసింగ్‌.. గెయిల్‌

పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ అథారిటీ బోర్డు(పీఎన్‌జీఆర్‌బీ) పైపులైన్ల టారిఫ్‌లను అంచనాలకంటే దిగువన నిర్ణయించినట్లు వెలువడిన వార్తలు ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. కాగా.. మరోపక్క రేటింగ్‌ సంస్థలు కంపెనీ రేటింగ్‌ను తాజాగా డౌన్‌గ్రేడ్‌ చేయడంతో వాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్ కార్పొరేషన్‌ కౌంటర్‌లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో కళతప్పాయి. వివరాలు ఇవీ..

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌
ఎన్‌బీఎఫ్‌సీ.. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన అన్ని రకాల రుణాలకు సంబంధించి BBB- రేటింగ్స్‌ను కేర్‌ రేటింగ్స్‌ తాజాగా డిఫాల్ట్‌(D)కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. మరోవైపు కమర్షియల్‌ పేపర్స్‌ రేటింగ్‌ను క్రిసిల్‌, ఇక్రా సైతం Dకు డౌన్‌గ్రేడ్ చేశాయి. దీంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలకు ఇన్వెస్టర్లు ఎగబడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దివాన్‌ హౌసింగ్‌ షేరు 11.5 శాతం కుప్పకూలి రూ. 99 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 91.30 వరకూ పడిపోయింది. ఇది ఐదేళ్ల కనిష్టంకాగా.. ట్రేడింగ్‌ పరిమాణం సైతం ఇప్పటివరకూ 20 రోజుల సగటుతో పోలిస్తే 8 రెట్లు ఎగసింది. కంపెనీ రూ. 1100 కోట్ల ఎన్‌సీడీల చెల్లింపుల్లో విఫలమయ్యే అవకాశమున్నట్లు రేటింగ్‌ సంస్థలు అభిప్రాయపడ్డాయి.Image result for GAIL India ltd

గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌
గెయిల్‌ ఇండియాకు కీలకమైన రెండు పైపులైన్ల సమీకృత టారిఫ్‌లను పీఎన్‌జీఆర్‌బీ తాజాగా 18 శాతం పెంచేందుకు నిర్ణయించింది. కొత్త ధరలు 2019 ఏప్రిల్‌ 1 నుంచీ అమల్లోకిరానున్నాయి. అయితే గెయిల్‌ ఆశిస్తున్న ధరల కంటే ఇవి దాదాపు 58 శాతం తక్కువకావడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గెయిల్‌ ఇండియా షేరు 9 శాతం కుప్పకూలి రూ. 326 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 323 వరకూ దిగజారింది. హజీరా-విజయ్‌పూర్-జగదీష్‌పూర్ నెట్‌వర్క్‌ టారిఫ్‌లను తాజాగా ఒక్కోఎంఎంబీటీయూకి రూ. 41.11కు పెంచినట్లు తెలుస్తోంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');