ఫెడ్‌ యూటర్న్‌? వారెవ్వా.. యూఎస్‌!

ఫెడ్‌ యూటర్న్‌? వారెవ్వా.. యూఎస్‌!

వాణిజ్య వివాదాలు, ఇతర ప్రతికూల పరిస్థితులవల్ల తలెత్తే రిస్కులను ఎదుర్కొనేందుకు తగిన విధంగా స్పందించనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ తాజాగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకూ వడ్డీ రేట్ల పెంపు బాటలో సాగుతున్న కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఇకపై రేట్ల కోతవైపు దృష్టి సారించనున్నట్లు అంచనాలు బలపడ్డాయి. దీనికితోడు ఫెడ్‌ ప్రెసిడెంట్ జేమ్స్‌ బుల్లార్డ్‌ సైతం త్వరలో రేట్ల తగ్గింపునకు చాన్స్‌ ఉన్నదంటూ పేర్కొనడంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. ఒక్కసారిగా కొనుగోళ్లకు ఎగబడటంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. డోజోన్స్‌ 512 పాయింట్లు(2 శాతం) పురోగమించి 25,332కు చేరగా.. ఎస్‌అండ్‌పీ 59 పాయింట్లు(2.2 శాతం) ఎగసి 2,803 వద్ద నిలిచింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 194 పాయింట్లు(2.65 శాతం) దూసుకెళ్లి 7,527 వద్ద స్థిరపడింది. వెరసి ఒకే రోజులో గత ఐదు నెలల్లోలేని విధంగా అత్యధిక లాభాలు ఆర్జించాయి.

Image result for FAANG logos

బాండ్ల ఈల్డ్స్‌ అప్‌
సోమవారం వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న ఆందోళనలతో నీరసిస్తూ వచ్చిన బాండ్ల ఈల్డ్స్‌ ఒక్కసారిగా పుంజుకున్నాయి. సోమవారం 20 నెలల కనిష్టం 2.06 శాతాన్ని తాకిన ట్రెజరీ ఈల్డ్స్‌ 4.5 బేసిస్‌ పాయింట్లు బలపడి 2.126కు చేరాయి. దీంతో వడ్డీ రేట్ల ప్రభావిత ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. 

టెక్‌ బౌన్స్‌బ్యాక్‌
సోమవారం పతన బాటలో సాగిన టెక్‌ దిగ్గజాలు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. ఫేస్‌బుక్‌, అమెజాన్‌, అల్ఫాబెట్ 2 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో నెట్‌ఫ్లిక్స్‌ 5 శాతం జంప్‌చేసింది. ఇతర కౌంటర్లలో ఉబర్‌ టెక్నాలజీస్‌ 3.6 శాతం, సీవీఎస్‌ హెల్త్‌ కార్ప్‌ 2.3 శాతం చొప్పున ఎగశాయి. కొత్తగా 1.1 కోట్ల షేర్లను జారీ చేయనున్న వెంటాస్‌ ఇంక్‌ 3 శాతం క్షీణించింది. 

యూరప్‌, ఆసియా ప్లస్‌లో
మంగళవారం యూరోపియన్‌ మార్కెట్లు లాభపడ్డాయి. యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ 0.5-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సానుకూల ట్రెండ్‌ కనిపిస్తోంది. జపాన్‌ 1.8 శాతం జంప్‌చేయగా.. హాంకాంగ్‌, చైనా, థాయ్‌లాండ్‌, తైవాన్‌ 0.7-0.4 శాతం మధ్య లాభపడ్డాయి. కొరియా నామమాత్ర లాభంతో ట్రేడవుతోంది. మిగిలిన మార్కెట్లలో ఇండొనేసియా, సింగపూర్‌ మార్కెట్లు ప్రారంభంకాలేదు.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');