ఎన్‌సీసీ పతనం- సద్భావ్‌ డీలా

ఎన్‌సీసీ పతనం- సద్భావ్‌ డీలా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులను కొత్త ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు వెలువడుతున్న అంచనాలు మౌలిక సదుపాయాల హైదరాబాద్‌ దిగ్గజం ఎన్‌సీసీ లిమిటెడ్‌ కౌంటర్లో భారీ అమ్మకాలకు కారణమవుతున్నాయి. కాగా.. మరోపక్క గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో మౌలిక సదుపాయాల దిగ్గజం సద్భావ్‌ ఇంజినీరింగ్ కౌంటర్లోనూ అమ్మకాలు తలెత్తాయి. దీంతో లాభాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం..

ఎన్‌సీసీ లిమిటెడ్‌
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నిర్మాణాలకుగాను గత ప్రభుత్వం కేటాయించిన కాంట్రాక్టులను కొత్త ప్రభుత్వం రద్దు చేయనుందన్న అంచనాలు ఎన్‌సీసీ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమవుతున్నట్లు సీఎన్‌బీసీ టీవీ18 చానల్‌ పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎన్‌సీసీ లిమిటెడ్‌ షేరు 14 శాతంపైగా పతనమై రూ. 100 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 98 దిగువకు చేరింది. కాగా.. సీఎన్‌బీసీ టీవీ18 టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌సీసీ యాజమాన్యం కాంట్రాక్టుల రద్దు అంశంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 35,000 కోట్లుకాగా.. ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ. 8,000-10,000 కోట్లవరకూ ఉంటుందని తెలియజేసింది. వీటిలో కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన అందుబాటు ధరల గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ విలువ రూ. 6,000 కోట్లుగా తెలియజేసింది. ఒకవేళ ఏపీలో కాంట్రాక్టులు రద్దయినప్పటికీ కంపెనీ ఆర్థిక పనితీరుపై ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది.

Related image

సద్భావ్‌ ఇంజినీరింగ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సద్భావ్‌ ఇంజినీరింగ్‌ నికర లాభం 58 శాతంపైగా క్షీణించి రూ. 29 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 7 శాతం నీరసించి రూ. 1022 కోట్లను తాకింది. ఇబిటా 2 శాతం పుంజుకుని రూ. 127 కోట్లకు చేరింది. మార్జిన్లు 11.3 శాతం నుంచి 12.4 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో సద్భావ్‌ షేరు 3 శాతం నష్టంతో రూ. 250 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 244 వరకూ క్షీణించింది. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');