ఈ షేర్ల పతనానికి అంతెక్కడో?

ఈ షేర్ల పతనానికి అంతెక్కడో?

ఎనిమిదిమంది డైరెక్టర్లు ఉన్నపళాన పదవులకు రాజీనామా చేసినట్లు వెల్లడికావడంతో పానీయాల సంస్థ మన్‌పసంద్‌ బెవరేజెస్‌ కౌంటర్‌ మరోసారి లోయర్‌ సీలింగ్‌ను తాకింది. ఈ కౌంటర్లో అంతా అమ్మేవాళ్లే తప్ప కొనుగోలుదారులు కరవుకావడం గమనార్హం. కాగా.. మరోపక్క కొద్ది రోజులుగా నేలచూపులకే పరిమితమై కదులుతున్న బంగారు ఆభరణ తయారీ, రిటైలింగ్‌ సంస్థ పీసీ జ్యువెలర్స్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు కనిపిస్తున్నాయి. వివరాలు చూద్దాం...

Image result for manpasand beverages

మన్‌పసంద్‌ బెవరేజెస్‌
సుమారు రూ. 300 కోట్ల టర్నోవర్‌పై రూ. 40 కోట్లవరకూ జీఎస్‌టీ ఎగవేతకుగాను నకిలీ యూనిట్లను మన్‌పసంద్‌ బెవరేజెస్‌ యాజమాన్యం సృష్టించిందని జీఎస్‌టీ కమిషనరేట్‌ ఇటీవల పేర్కొంది. దీంతో జీఎస్‌టీ చెల్లింపుల కేసులో కంపెనీ టాప్‌ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్‌ చేసింది. కంపెనీ ఎండీ అభిషేక్‌ సింగ్‌, ఆయన సోదరుడు హర్షవర్ధన్‌ సింగ్‌తోపాటు.. సీఎఫ్‌వో పరేష్‌ థక్కర్‌లను సెంట్రల్‌ జీఎస్‌టీ, కస్టమ్స్‌ కార్యాలయ అధికారులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరికి బెయిల్‌ను నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన్‌పసంద్‌ బెవరేజెస్‌ నుంచి  8మంది డైరెక్టర్లు ఉన్నపళాన తప్పుకున్నారు. ఈ వార్తల నేపథ్యంలో గత ఐదు రోజులుగా మన్‌పసంద్‌ బెవరేజెస్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే. గత 5 రోజుల్లో ఈ షేరు 55 శాతం పతనమైంది. తాజాగా ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 51.45 వద్ద ఫ్రీజయ్యింది. ఇది చరిత్రాత్మక కనిష్టంకావడం గమనార్హం!

Image result for pc jewellers

పీసీ జ్యువెలర్స్‌
బోర్డు సమావేశాన్ని ఈ నెల 29 నుంచి 30కు వాయిదా వేసిన నేపథ్యంలో పీసీ జ్యువెలర్స్‌ గతేడాది(2018-19) క్యూ4 ఫలితాలను గురువారం ప్రకటించింది. క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 376 కోట్ల నికర నష్టం ప్రకటించడంతో ఈ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2203 కోట్లను తాకగా.. రూ. 452 కోట్లమేర ఇబిటా నష్టం ప్రకటించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో పీసీ జ్యువెలర్స్ షేరు 12 శాతం కుప్పకూలి రూ. 76 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 73 వరకూ పతనమైంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు 30 శాతంపైగా క్షీణించింది. ఏప్రిల్‌ 14 నుంచి చూస్తే 55 శాతం పతనమైంది. కాగా.. ఎగుమతుల విభాగాన్ని విడదీసి సొంత అనుబంధ సంస్థ పీసీజే జెమ్స్ అండ్‌ జ్యువెలరీలో విలీనం చేసేందుకు ఈ నెల 12న కంపెనీ బోర్డు అనుమతించింది. ఇందుకు అనుగుణంగా పీసీజే జెమ్స్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీస్తూ వాటాదారులకు షేర్లను కేటాయించనుంది.Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');