ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు దూకుడు ఎక్కువ ! పెరిగేలోపే పట్టుకోండి!

ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు దూకుడు ఎక్కువ ! పెరిగేలోపే పట్టుకోండి!

కేంద్రంలో తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంతో మార్కెట్లలో బుల్లిష్ సెంటిమెంట్ బలపడటమే కాకుండా, స్మాల్ క్యాప్ రంగం వైపు మదుపర్ల ఆసక్తిని పెరిగేలా చేసింది. స్మాల్ క్యాప్ రంగంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు అవకాశాలకోసం వెతుక్కుంటున్నారనే చెప్పాలి. గత సంవత్సరం BSE స్మాల్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 14శాతం నష్టపోయింది. కానీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వమే రానుందన్న ఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం బెంచ్ మార్క్ సూచీలు ఆల్‌ టైం గరిష్టానికి చేరువలో పయనిస్తున్నాయి. కాగా ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి లాభాలను చూపించనున్నాయని ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అవేంటో చూద్దాం.
NCC : ప్రస్తుత ధర రూ. 113.45 / టార్గెట్ ప్రైస్ రూ. 160
గత ఆర్ధిక సంవత్సరం 2019 కంటే.. 2021 ఆర్ధిక సంవత్సరం నాటికి NCC 15శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. కంపెనీకున్న స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, బలమైన బ్యాలెన్స్ షీట్ పొజీషన్ వంటివి NCC ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ ICICI డైరెక్ట్ ఈ స్టాక్స్ కు టార్గెట్ ప్రైస్‌ రూ. 160 గా నిర్ణయించింది.
JK లక్ష్మీ సిమెంట్ : ప్రస్తుత ధర రూ. 392.35 : టార్గెట్ ప్రైస్ రూ. 485
దీర్ఘకాలిక ఇన్ఫ్రా గ్రోత్‌ను బట్టి చూస్తే... JK లక్ష్మీ సిమెంట్  రాబోయే రెండు క్వార్టర్లలో మరింత మెరుగైన ఫలితాలను వెల్లడించవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఇన్ఫ్రా రంగంలో సిమెంట్‌కు డిమాండ్ పెరుగుతుండటం, సిమెంట్ రంగంలో స్థిరత్వం వంటి కారణాల వల్ల JK లక్ష్మీ సిమెంట్స్ షేర్లు ఆకర్షణీయంగా మారాయి. 
Elgi ఎక్విప్‌మెంట్స్ : ప్రస్తుత ధర రూ. 281.95 : టార్గెట్ ప్రైస్ రూ. 345 
డొమెస్టిక్ మార్కెట్లలో మంచి డిమాండ్, ఎయిర్ కంప్రెసర్‌ల విక్రయాలు ఊపందుకోడం, కొత్త ఉత్పత్తులైన ఆయిల్ ఫ్రీ కంప్రెసర్స్, AB సిరీస్  వంటి కారణాల వల్ల ఎల్గీ ఎక్విప్‌మెంట్స్ షేర్లు మరింత ఆకర్షణీయంగా కనబడతున్నాయి. ICICI డైరెక్ట్ ఈ స్టాక్స్ టార్గెట్ ప్రైస్‌ రూ. 345 గా నిర్ణయించింది.
మరో ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ అయిన IIFL అంచనాల ప్రకారం ఈ కింది స్టాక్స్ ..టార్గెట్ ప్రైస్‌లు ఇలా ఉన్నాయి.

1. Capacite Infraprojects: CMP: Rs 270.35 Target Price: Rs 322 
2. KEC International: CMP:Rs 331.8 Target Price: Rs 376 
3. Navin Fluorine International: CMP: Rs 736.70 Target Price: Rs 810 

దౌలత్ క్యాపిటల్ అంచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 
1. Ahluwalia Contracts (India): CMP:Rs 359.55 Target Price: Rs 411 
2. HG Infra Engineering: CMP: Rs 280.89 Target Price: Rs 456 
3. NCC: CMP: Rs 113.45 Target Price: Rs 179 

HDFC సెక్యూరిటీస్ అంచనాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1. Ashoka Buildcon: CMP:Rs 144.60 Target Price: Rs 261 
2. Petronet LNG: CMP:Rs 243.7 Target Price: Rs 345 
3. Orient Cement CMP:Rs 118.65 Target Price: Rs 140 

Smallcap snip 1

courtesy by:Economic Times

Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవిtv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');