రానున్న 5 ఏళ్లకు ఏ స్టాక్స్‌ బెటర్...? 

రానున్న 5 ఏళ్లకు ఏ స్టాక్స్‌ బెటర్...? 

2014 నుండి 2019 వరకూ నరేంద్ర మోడీ పాలించిన 5 ఏళ్ళలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బెంచ్ మార్క్ సూచీలు  అవుట్ పెర్ఫార్మ్ చేశాయి. గత రెండేళ్ళుగా స్మాల్ , మిడ్ క్యాప్ షేర్లు వేగంగా పుంజుకోడం మనం చూశాం. అదేవిధంగా గత 18 నెలల్లో లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా కాస్త అప్పర్ హ్యాండ్‌గా నిలిచాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ పుంజుకున్న సమయంలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు కాస్త ఒత్తిడికి గురైనా రానున్న కాలంలో అవి మరింత ఆకర్షణీయంగా మారొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం విస్తృత మార్కెట్లో దిద్దుబాటు చర్యలు ఆయా స్టాక్స్ మరింత పుంజుకోడానికి దోహద పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా గత సంవత్సరం లార్జ్ క్యాప్ స్టాక్స్ మంచి ఊపు మీదున్నప్పుడు స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్లు అల్లకల్లోలంగా మారాయి. అయితే .. రూపీ మారకపు విలువ బలపడటం,  కేంద్రంలో మరోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం వంటి కారణాలతో లార్జ్ క్యాప్ రంగంలో కొంత కరెక్షన్లకు అవకాశం ఉండొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.

largecap-1

Courtesy by: Money control 

లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు కాకుండా ప్రస్తుతం రానున్న 5 సంవత్సరాల కాలంలో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు కొనడం బెస్ట్ పాలసీగా ఉంటుందని శామ్‌కో సెక్యూరిటీస్ సంస్థ పేర్కొంది. మదుపర్లు నేరుగా కానీ, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ స్మాల్ , మిడ్ క్యాప్ స్టాక్స్ ను ఎంచుకోడం లాభదాయకంగా ఉంటుందని మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంది. 

smallcap-1

Courtesy by: Money control 
మిడ్ క్యాప్ స్టాక్స్‌లో అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్జ్ , BHEL, కుమ్మిన్స్, ఎండ్యూరెన్స్ టెక్, థెర్మాక్స్ , ఉజ్జీవన్ ఫిన్ వంటి స్టాక్స్ రానున్న 5 ఏళ్ళకాలానికి మంచి ఎంపికగా మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు. Aegis లాజిస్టిక్స్ , అపోలో టైర్స్, సియెంట్ లిమిటెడ్, KEC ఇంటర్నేషనల్, M&M ఫిన్,  NCC లిమిటెడ్ వంటి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్ల టార్గెట్ ప్రైస్‌లను కూడా బ్రోకింగ్ కంపెనీలు పెంచాయి.