ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

ఫ్లాట్‌ ఓపెనింగ్‌ నేడు?!

మూడు రోజులుగా లాభాల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 6 పాయింట్ల నామమాత్ర నష్టంతో 11,918 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకానుండటంతో గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. దీంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా నేడు మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కన్సాలిడేట్‌ కావచ్చని అభిప్రాయపడ్డారు. మెమోరియల్‌ డే సందర్భంగా సోమవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు సెలవు. 
 
కొనుగోళ్ల పుష్‌- సెన్సెక్స్ డ'బుల్‌
కేంద్రంలో సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో ఇన్వెస్టర్లకు మరోసారి జోష్‌ వచ్చింది. దీంతో తడబడుతూ ప్రారంభమైన మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సెంచరీ చేసింది. గరిష్టంగా 39,822ను తాకింది. చివరికి 249 పాయింట్లు ఎగసి 39,683 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 11,957 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. చివరికి 81 పాయింట్లు బలపడి 11,925 వద్ద స్థిరపడింది. వెరసి సోమవారం వరుసగా రెండో రోజు మార్కెట్లు లాభాలతో నిలిచాయి.  

నిఫ్టీ అంచనాలు
నిఫ్టీ నేడు బలహీనపడితే తొలుత 11,839 పాయింట్ల వద్ద, తదుపరి 11,753 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. ఒకవేళ ఊపందుకుంటే.. తొలుత 11,984 పాయింట్ల వద్ద, తదుపరి 12,043 స్థాయిలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చని భావిస్తున్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి 31,293, 30,939 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదే విధంగా 31,851, 32,055 స్థాయిలలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1215 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేస్తే.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇక వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 2026 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 195 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే. Most Popular

tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');