రుచిరా పేపర్స్‌- రత్నమణి మెరుపులు

రుచిరా పేపర్స్‌- రత్నమణి మెరుపులు

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ప్రోత్సాహాన్నివ్వడంతో ఇన్వెస్టర్లు ప్రింటింగ్, ప్యాకేజింగ్ పేపర్ తయారీ సంస్థ రుచిరా పేపర్స్‌ లిమిటెడ్‌ కౌంటర్లో కొనుగోళ్లకు క్యూకట్టారు. కాగా.. మరోపక్క తాజాగా రెండు కాంట్రాక్టులను పొందినట్లు వెల్లడించడంతో స్టీల్‌, టైటానియం పైపుల తయారీ సంస్థ రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి.ర వివరాలు ఇలా..

రుచిరా పేపర్స్‌ 
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రుచిరా పేపర్స్‌ నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 6 కోట్లను అధిగమించింది. ఇబిటా సైతం మూడు రెట్లు పెరిగి రూ. 12 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 24 శాతం పెరిగి రూ. 28 కోట్లను చేరింది. మార్జిన్లు 16.4 శాతం నుంచి 43.5 శాతానికి జంప్‌చేశాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం రుచిరా పేపర్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 16 శాతం దూసుకెళ్లి రూ. 110 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 114 వరకూ ఎగసింది.

Related image

రత్నమణి మెటల్స్‌
టైటానియం వెల్డెడ్‌ ట్యూబుల సరఫరా కోసం రెండు ఆర్డర్లు లభించినట్లు రత్నమణి మెటల్స్‌ అండ్‌ ట్యూబ్స్‌ తాజాగా పేర్కొంది. వీటి సంయుక్త విలువ రూ. 99 కోట్లుకాగా.. దేశీయంగా లభించిన రూ. 73 కోట్ల కాంట్రాక్టును 2020 మేలోగా పూర్తిచేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఇక రూ. 26 కోట్ల విలువైన విదేశీ ఆర్డర్‌ను 26 నెలల్లోగా పూర్తిచేయవలసి ఉన్నదని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రత్నమణి షేరు 
దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 949 వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో ప్రమోటర్లకు 60.09% వాటా ఉంది.