కెపాసైట్‌ అప్‌- లుపిన్‌ డౌన్‌

కెపాసైట్‌ అప్‌- లుపిన్‌ డౌన్‌

అలిస్సమ్‌ డెవలపర్స్‌ నుంచి తొలిసారి కాంట్రాక్టును పొందినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో సందడి చేస్తోంది. అయితే మరోవైపు గోవా ప్లాంటుపై అధికారిక చర్యలు(OAI) చేపట్టనున్నట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొనడంతో హెల్త్‌కేర్‌ రంగ దేశీ దిగ్గజం లుపిన్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ డీలాపడింది. వివరాలు ఇవీ..

కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌
మార్కెట్‌ సిటీ రీసోర్సెస్‌కు చెందిన అలిస్సమ్ డెవలపర్స్ నుంచి రూ. 170 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించినట్లు కెపాసైట్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ తాజాగా పేర్కొంది. పుణేలోని వాకాడ్‌లో సివిల్‌ పనుల కోసం ఈ ఆర్డర్ పొందినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో  కెపాసైట్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 275 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 278 వరకూ ఎగసింది.

Image result for Lupin ltd

లుపిన్‌ లిమిటెడ్‌
గోవా ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ఎఫ్‌డీఏ అధికారిక చర్యలకు సిఫారసు చేయడంతో లుపిన్‌ కౌంటర్‌లో అమ్మకాలు తలెత్తాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో లుపిన్ షేరు 2.6 శాతం నష్టంతో రూ. 744 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 720 వరకూ నీరసించింది. ఇది 5 శాతం పతనంకాగా.. జనవరి 28- ఫిబ్రవరి 8 మధ్య యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు నిర్వహించినట్లు లుపిన్‌ తెలియజేసింది. ఓఏఐ ప్రకటిస్తే.. పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లకు అనుమతులు నిలిచిపోయే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.