గెయిల్‌ బోనస్‌- భెల్‌ భళా

గెయిల్‌ బోనస్‌- భెల్‌ భళా

వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. మరోవైపు విద్యుత్‌ పరికరాల ప్రభుత్వ దిగ్గజం భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ (బీహెచ్‌ఈఎల్‌) గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. దీంతో ఈ రెండు కౌంటర్లూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..

గెయిల్‌ లిమిటెడ్‌ 
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గెయిల్‌ లిమిటెడ్‌ రూ. 1122 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇబిటా 37 శాతం క్షీణించి రూ. 1684 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 5 శాతం తక్కువగా రూ. 18,764 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్‌ షేర్లు జారీ చేసేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 1 షేరుకి మరో షేరు ఫ్రీగా లభించనుంది. 9 శాతం మార్జిన్లను సాధించింది. కాగా.. పెట్రోకెమ్‌ ఆదాయం 7 శాతం పెరిగి రూ. 1719 కోట్లను తాకగా.. ఈ విభాగం ఇబిటా నష్టం రూ. 20 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం గెయిల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.7 శాతం లాభంతో రూ. 347 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 351 వరకూ ఎగసింది.

Related image

బీహెచ్‌ఈఎల్‌
విద్యుత్‌ ఉపకరణాల దిగ్గజం భెల్‌ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 683 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 50 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా పెరిగి రూ. 10,297 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో భెల్‌ షేరు 1.5 శాతం బలపడి రూ. 70 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 72 వరకూ పెరిగింది.