సంధార్‌ టెక్‌- శాక్‌సాఫ్ట్ స్పీడ్‌

సంధార్‌ టెక్‌- శాక్‌సాఫ్ట్ స్పీడ్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు జోష్‌నివ్వడంతో ఇన్వెస్టర్లు ఆటో విడిభాగాల సంస్థ సంధార్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లో కొనుగోళ్లకు క్యూకట్టారు. కాగా..  మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మధ్యతరహా ఐటీ కంపెనీ శాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

సంధార్‌ టెక్నాలజీస్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో సంధార్‌ టెక్నాలజీస్ నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 27 కోట్లకు చేరింది. ఇబిటా సైతం 25 శాతం ఎగసి రూ. 61 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 24 శాతం పెరిగి రూ. 512 కోట్లను అధిగమించింది. మార్జిన్లు 11.8 శాతం నుంచి 11.9 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం సంధార్‌ టెక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7.3 శాతం దూసుకెళ్లి రూ. 312 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 314 వరకూ ఎగసింది.

Related image

శాక్‌సాఫ్ట్ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో శాక్‌సాఫ్ట్ లిమిటెడ్‌ నికర లాభం 41 శాతం ఎగసి రూ. 11 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం పుంజుకుని రూ. 94 కోట్లను తాకింది. ఇబిటా 51 శాతం వృద్ధితో రూ. 17 కోట్లను అధిగమించింది. మార్జిన్లు 14.5 శాతం నుంచి 18.2 శాతానికి పురోగమించాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం శాక్‌సాఫ్ట్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 8 శాతం జంప్‌చేసి రూ. 303 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 305 వరకూ ఎగసింది.



Most Popular