అంబరానికి.. యాంబర్‌- ఎన్‌టీపీసీ 

అంబరానికి.. యాంబర్‌- ఎన్‌టీపీసీ 

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు జోష్‌నివ్వడంతో ఇన్వెస్టర్లు యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కౌంటర్లో కొనుగోళ్లకు క్యూకట్టారు. దీంతో ఈ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తోంది. కాగా..  మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో విద్యుత్‌ రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వివరాలు చూద్దాం.. 

యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్ నికర లాభం 82 శాతం జంప్‌చేసి రూ. 62 కోట్లకు చేరింది. ఇబిటా సైతం 51 శాతం ఎగసి రూ. 102 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 40 శాతం పెరిగి రూ. 971 కోట్లను అధిగమించింది. మార్జిన్లు 9.8 శాతం నుంచి 10.6 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం దూసుకెళ్లింది. రూ. 821 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 874 వరకూ ఎగసింది.

Image result for NTPC ltd

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎన్‌టీపీసీ లిమిటెడ్‌ నికర లాభం 49 శాతం ఎగసి రూ. 4350 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం క్షీణించి రూ. 21,222 కోట్లను తాకింది. వాటాదారులకు తాజాగా షేరుకి రూ. 2.50 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. ఇప్పటికే షేరుకి రూ. 3.58 చొప్పున ఫిబ్రవరిలో మధ్యంతర డివిడెండ్‌ చెల్లించింది. కాగా.. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌టీపీసీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.5 శాతం పుంజుకుని రూ. 133 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 137 వరకూ ఎగసింది.