ఆటుపోట్లతో- పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌

ఆటుపోట్లతో- పీఎస్‌యూ బ్యాంక్స్‌ ప్లస్‌

నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్రంలో మరోసారి సుస్ధిర ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో సెంటిమెంటు బలపడింది. అయితే ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. తదుపరి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 98 పాయింట్లు పెరిగి 39,532 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 20 పాయింట్లు బలపడి 11,864 వద్ద కదులుతోంది. కాగా.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు కొనసాగుతుండటంతో శుక్రవారం అమెరికా, యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి.

రియల్టీ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.2 శాతం పుంజుకోగా రియల్టీ 1 శాతం పెరిగింది. ప్రభుత్వ బ్యాంక్స్‌లో సిండికేట్‌, యూనియన్‌, ఓబీసీ, పీఎన్‌బీ, కెనరా, బీవోఐ, జేఅండ్‌కే, సెంట్రల్‌, ఇండియన్‌, అలహాబాద్‌, బీవోబీ, ఎస్‌బీఐ 4-1.6 శాతం మధ్య ఎగశాయి. రియల్టీ స్టాక్స్‌లో మహీంద్రా లైఫ్‌, ఒబెరాయ్‌, ఇండియాబుల్స్‌, ఫీనిక్స్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, ప్రెస్టేజ్‌ 3.3-0.6 శాతం మధ్య లాభపడ్డాయి. 

బ్లూచిప్స్‌ తీరిదీ
ఇక నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఐబీ హౌసింగ్‌, యస్ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ 4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, టెక్‌ మహీంద్రా, ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌, ఆర్‌ఐఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ 2-0.6 శాతం మధ్య క్షీణించాయి.

పేజ్‌, దివీస్‌ డీలా
డెరివేటివ్‌ కౌంటర్లలో ఐజీఎల్‌, ఐఎఫ్‌సీఐ, సుజ్లాన్‌, జీఎంఆర్‌, అదానీ పవర్‌, పీఎన్‌బీ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క పేజ్‌, దివీస్‌, లుపిన్‌, అశోక్‌ లేలాండ్‌, ఇండియా సిమెంట్స్‌, ఆర్‌పవర్, మెక్‌డోవెల్‌ 9-2 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు అప్‌
మార్కెట్లు జోరందుకోవడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లకూ డిమాండ్‌ పెరిగింది. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.6-1 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1064 లాభపడితే.. 382 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి.