బీవోబీ, టీడీ పవర్‌.. దూకుడు

బీవోబీ, టీడీ పవర్‌.. దూకుడు

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో టీడీ పవర్‌ సిస్టమ్స్‌  కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

బ్యాంక్ బరోడా
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నికర నష్టం 68 శాతం తగ్గి రూ. 991 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం సైతం 27 శాతం పుంజుకుని రూ. 5067 కోట్లను అధిగమించింది. ప్రొవిజన్లు రూ. 5399 కోట్లుకాగా.. గత క్యూ4లో రూ. 6672 కోట్లను కేటాయించింది.  ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో బీవోబీ షేరు 6.3 శాతం జంప్‌చేసి రూ. 134 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 144 వరకూ ఎగసింది.

Image result for td power systems

టీడీ పవర్‌ సిస్టమ్స్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో టీడీ పవర్‌ సిస్టమ్స్‌ నికర లాభం 4 రెట్లు ఎగసి రూ. 15 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పుంజుకుని రూ. 201 కోట్లకు చేరింది. ఇబిటా రెట్టింపునకు పెరిగి 28 కోట్లను తాకింది. మార్జిన్లు 8.7 శాతం నుంచి 14.2 శాతానికి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టీడీ పవర్‌ సిస్టమ్స్‌ షేరు 11 శాతం దూసుకెళ్లి రూ. 136 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 143 వరకూ ఎగసింది.