అదానీ గ్రూప్‌ స్టాక్స్‌.. హద్దేముంది?

అదానీ గ్రూప్‌ స్టాక్స్‌.. హద్దేముంది?

కేంద్రంలో తిరిగి ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫలితాల సరళి వెల్లడించడంతో అదానీ గ్రూప్‌ కౌంటర్లు రేసు గుర్రాల్లా దౌడుతీస్తున్నాయి. అదానీ గ్రూప్‌లోని అన్ని స్టాక్స్‌లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో లాభాల దుమ్ము రేపుతున్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

Image result for Adani group

ఒకటే దూకుడు
నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని కానున్న అంచనాల కారణంగా గౌతమ్‌ అదానీ గ్రూప్‌ సంస్థలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్‌ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 10 శాతం దూసుకెళ్లి రూ. 174 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 181 వరకూ పెరిగింది. ఈ బాటలో అదానీ పవర్‌ 7 శాతం ఎగసింది. రూ. 50 వద్ద ట్రేడవుతోంది. ఇక అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ 7.5 శాతం పురోగమించి రూ. 415 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 431 సమీపంలో 52 వారాల గరిష్టానికి చేరింది. ఇదే విధంగా అదానీ ట్రాన్స్‌మిషన్‌ 4.5 శాతం జంప్‌చేసి రూ. 239ను తాకగా.. అదానీ గ్యాస్‌ 4.4 శాతం లాభపడి రూ. 140 వద్ద కదులుతోంది. ఇంట్రాడేలో రూ. 146 వరకూ పెరిగింది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ సైతం 3 శాతం బలపడి రూ. 45 వద్ద కదులుతోంది. Most Popular