మోదీ (NDA)పాలనలో 100శాతం పెరిగిన స్టాక్స్ ఇవే..! ప్రాఫిట్స్ బుక్‌ చేస్తున్నారా?

మోదీ (NDA)పాలనలో 100శాతం పెరిగిన స్టాక్స్ ఇవే..! ప్రాఫిట్స్ బుక్‌ చేస్తున్నారా?

గత 5 ఏళ్ళ మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనలో BSE 500 లోని దాదాపు 197 స్టాక్స్ 100శాతం పెరిగాయి. ఇక రానున్న ఎన్నికల ఫలితాలకు ముందుగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ విడుదల తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఉరకలెత్తాయి. సన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ కూడా దాదాపు 470 పాయింట్ల లాభాన్ని ఆర్జించింది. కాగా గత 5 ఏళ్ళలో బీఎస్‌ఈలోని  మిండా ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్, KEI ఇండస్ట్రీస్ దాదాపు 1000 శాతం రిటర్న్స్ ను అందించాయి. ఇక బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మెటాలిక్స్, అవంతీ ఫీడ్స్, ఇండియాబుల్స్ వెంచర్స్, IFB ఇండస్ట్రీస్ , V-మార్ట్ , సనాటా సాఫ్ట్‌వేర్ వంటి స్టాక్స్ 100-900శాతం పెరిగాయి. మొత్తం మీద చూస్తే.. మోడీ 5 ఏళ్ళ పాలనలో నిఫ్టీ, సెన్సెక్ 50శాతం రిటర్న్స్ ను మదుపర్లకు అందించాయి.

500
ఇదే సమయంలో BSE 500 లోని 30 స్టాక్స్ 50-80శాతం పడిపోయినవి కూడా ఉన్నాయి. వీటిలో ప్రముఖంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, జయప్రకాష్ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యునికేషన్స్ వంటి స్టాక్స్ దాదాపు 80శాతం వరకూ నష్టపోయాయి. మోదీ పాలన కాలంలో BSE  500 లోని సుమారు 200 కంపెనీల స్టాక్స్ ముదపర్ల సంపదను రెట్టింపు చేశాయనే చెప్పుకోవచ్చు . గత 5 ఏళ్ళలో ఎంతో వృద్ధిని చూపిన ఈ స్టాక్స్ రానున్న మరో 5 సంవత్సరాల కాలానికి మరింత ఆకర్షణీయంగా మారొచ్చని SSJ ఫైనాన్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థ అంచనా వేస్తోంది. మరి ఇన్వెస్టర్ల సంపదను డబుల్ చేసిన ఈ స్టాక్స్ రానున్న మరో 5 ఏళ్ళ కాలానికి అట్టిపెట్టుకోవచ్చా అన్న ప్రశ్నకు ఎనలిస్టులు సమాధానమిస్తూ.. మరో 5 సంవత్సరాల కాలం పాటు ఈ స్టాక్స్ లో కొంత కరెక్షన్ కనపడొచ్చని.. 20శాతం కరెక్షన్ రూల్స్ కింద స్టాప్ లాస్ గా భావించవచ్చని వారు అంటున్నారు. కౌంటర్ ట్రెండ్‌లో ర్యాలీ కనబడుతుంటే కనుక ఈ స్టాక్స్ విషయంలో స్టాప్ లాస్‌ గురించి ఆలోచించవచ్చని ఎపిక్ రీసెర్చ్ సంస్థ పేర్కొంది. ఉదాహరణకు మీ వద్ద నున్న రూ. 10 ముఖ విలువ కలిగిన ఒక స్టాక్ 200శాతం పెరిగినపుడు .. మరో 5 సంవత్సరాల కాలంపాటు ఉంచుకోదలుచుకుంటే.. 20శాతం కరెక్షన్‌కు సిద్ధపడి ఉండాలి, మరియు 20 శాతం స్టాప్ లాస్‌ను భరించాల్సి రావొచ్చు. అదే స్టాక్ ను ప్రస్తుత ధరతో పోలిస్తే..నష్ట భయం రూ.20 గా ఉంటుంది తప్ప లాభాల స్వీకరణకు ఇది అనుకూలమే అని ప్రముఖ  బ్రోకింగ్ సంస్థ కార్వే తెలిపింది. 
 

Disclaimer: పైన పేర్కొన్న సలహాలు , సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోగలరని మనవి.