ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్..! ఈ 10 స్టాక్స్‌ వైపే ఎక్స్‌పర్ట్స్ చూపులు..!!

ఎగ్జిట్ పోల్ ఎఫెక్ట్..! ఈ 10 స్టాక్స్‌ వైపే ఎక్స్‌పర్ట్స్ చూపులు..!!

లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి. రానున్న 5 ఏళ్ళ పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వమే కొనసాగనుందని వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మార్కెట్లు ఊపందకున్నాయి. నెట్ వర్క్ 18-IPSOS సర్వే ప్రకారం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వమే రానుందని అంచనా వేస్తుంది. ఎన్డీఏ కూటమికి 336 ఎంపీ సీట్లు వస్తాయని నెట్ వర్క్ 18 అంచనా వేసింది. అలాగే రిపబ్లిక్ టవీ-C వోటర్ తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ 287 సీట్లను గెలుచుకోనుందని ప్రకటించింది. రాజకీయ విశ్లేషకులు సైతం బీజేపీకి 270 కంటే ఎక్కువ సీట్లు రానున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఎన్నికలకు ముందు కరెక్షన్లకు గురైన మార్కెట్ల నుండి స్టాక్స్ పిక్ చేసుకున్న మదుపర్లు మే 23 తరువాత లాభాలు బుక్ చేసుకునే అవకాశం ఉందని శామ్‌కో సెక్యూరిటీస్ సంస్థ అంచనా వేస్తోంది. ఫలితాల తరువాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పడనుందన్న అంచనాతో పలు బ్రోకింగ్ సంస్థలు, స్టాక్ ఎనలిస్టులు ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కొన్ని స్టాక్స్ ను ఎంపిక చేశారు. ఇవి రానున్న రోజుల్లో మరింత లాభదాయకంగా మారుతాయని బ్రోకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. అవేంటో మనమూ చూద్దాం.

Image result for sbi
SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ) ;
కార్వే బ్రోకింగ్ సంస్థ అంచనా మేరకు ఎస్బీఐ షేర్ రానున్న కాలంలో మరింతగా రాణించనుంది. ఎసెట్స్ క్వాలిటీలో ఇంప్రూవ్‌మెంట్‌తో గ్రాస్ NPA 7.53 శాతంగా ఉంది ఈ మార్చ్ త్రైమాసికం నాటికి.  
గత సంవత్సరంతో పోలిస్తే..ఇది 10.9శాతం గా ఉండటం గమనార్హం. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కం (NII) కూడా పెరగడంతో ఎస్బీఐ స్టాక్స్ మరింత బలంగా కనబడుతున్నాయి. 2020 ఆర్ధిక సంవత్సరం నాటికి ఈక్విటీ రిటర్న్స్ (ROE) కూడా మెరుగ్గా కనబడుతున్నాయని కార్వే సంస్థ అభిప్రాయపడుతోంది. 

Image result for icici
ICICI బ్యాంక్ :
ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో దిగ్గజం ICICI బ్యాంక్ వెల్లడించిన తన మార్చ్ త్రైమాసిక ఫలితాల ప్రకారం , క్రెడిట్ క్వాలిటీ పెరగడంతో పాటు , లోన్ రికవరీలో వృధ్ధిని కూడా సాధించిందని చెప్పొచ్చు. ఆరోగ్య కర రుణాలు, డిపాజిట్ల రేషియో పెరగడం వంటివి ICICI బ్యాంక్ షేర్లను మరింత ఆకర్షణీయంగా మార్చాయని కార్వే బ్రోకింగ్ సంస్థ పేర్కొంది. 2020 ఆర్ధిక సంవత్సరం నాటికి ICICI బ్యాంక్ ROE గణనీయంగా మెరుగుపడనుందని కార్వే సంస్థ అంచనా వేస్తోంది. 

Image result for tata steel
టాటా స్టీల్ : 
రానున్న కొద్ది నెలల్లో మెటల్స్, స్టీల్ రంగంలో డిమాండ్ బాగా పెరగనుంది. ఇప్పటికే స్టీల్ రంగంలో ఉత్పాదకత పెరగింది. 2020 ఆర్ధిక సంవత్సరం రెండో క్వార్టర్ నాటికి స్టీల్ రంగం అధిక లాభాలను చూపించే సెక్టార్‌గా మారోచ్చని కార్వే అభిప్రాయ పడుతోంది. టాటా స్టీల్ వాల్యూయేషన్స్ కూడా మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని కార్వే బ్రోకింగ్ అంచనా వేస్తోంది. 

Image result for l&t logo
లార్సెన్ అండ్ టుబ్రో (L&T)
L&T క్యాపెక్స్ విషయంలో సమృద్ధి కలిగి ఉండటం, కంపెనీ మార్జిన్లు పెరగడం, రానున్న ఆర్ధిక సంవత్సరం నాటికి ROE మరింత ఇంప్రూవ్‌ అవ్వడం తథ్యమని కార్వే బ్రోకింగ్ సంస్థ అంచనా వేస్తోంది. 

Image result for mahindra & mahindra logo
మహీంద్ర&మహీంద్ర
మహీంద్ర కంపెనీ వాల్యూయేషన్స్ ఆకర్షణీయంగా ఉండటంతో బాటు వినియోగ దారుల నుండి వస్తున్న అధిక డిమాండ్ కూడా కంపెనీకి  లాభదాయకంగా మారింది. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ ఆధారిత పనిముట్ల విషయంలో కంపెనీ మరింత ఉత్పాదకతను పెంచనుండటం కూడా మహీంద్ర & మహీంద్ర షేర్లను బ్లూ చిప్ షేర్లుగా మార్చేశాయని కార్వే సంస్థ అభిప్రాయ పడుతోంది. 
ఇక మరో ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ అయిన SSJ ఫైనాన్స్ & సెక్యూరిటీస్ సంస్థ అంచనాల ప్రకారం 

HDFC బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS), రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్ ,వంటి స్టాక్స్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత లాభదాయకంగా మారనున్నాయి. 

Image result for hdfcImage result for rilImage result for bajaj fin


Disclaimer: పైన పేర్కొన్న విషయాలు , సలహాలు ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు, స్టాక్ ఎనలిస్టులచే ఇవ్వబడినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి సరిచూసుకోమని మనవి.