బజాజ్‌ ద్వయం.. రేసు గుర్రాల్‌

బజాజ్‌ ద్వయం.. రేసు గుర్రాల్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో బజాజ్‌ గ్రూప్‌లోని ఎన్‌బీఎఫ్‌సీలు బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్ జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ వరుసగా మూడో రోజు లాభపడటం ద్వారా సరికొత్త గరిష్టాన్ని తాకగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ సైతం చరిత్రాత్మక గరిష్టానికి చేరడం విశేషం! ఇతర వివరాలు చూద్దాం..

Image result for bajaj finserv

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌
బజాజ్‌ గ్రూప్‌లోని హోల్డింగ్‌ కంపెనీ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 834 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 32 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం సైతం 43 శాతం పెరిగి రూ. 12995 కోట్లను తాకింది. కంపెనీకి బజాజ్‌ ఫైనాన్స్‌లో దాదాపు 55 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా అన్‌లిస్టెడ్‌ సంస్థలు బజాజ్‌ అలియంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలలో 74 శాతం వాటాలను కలిగి ఉంది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 7983 వద్ద  ట్రేడవుతోంది. తొలుత రూ. 8205 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!

Related image

బజాజ్ ఫైనాన్స్‌
గతేడాది క్యూ4లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ర్యాలీ బాటలో సాగుతున్న బజాజ్‌ ఫైనాన్స్‌ షేరు మరోసారి దూకుడు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5.5 శాతం జంప్‌చేసి రూ. 3282 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3298ను అధిగమించింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత మూడు రోజుల్లోనూ ఈ కౌంటర్‌ 13 శాతం లాభపడటం విశేషం! క్యూ4లో బజాజ్ ఫైనాన్స్ నికర లాభం 57 శాతం ఎగసి రూ. 1176 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం సైతం 50 శాతం పుంజుకుని రూ. 3394 కోట్లకు చేరింది. నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ 41 శాతం బలపడి రూ. 1.16 ట్రిలియన్లను తాకినట్లు కంపెనీ తెలియజేసింది.tv5awards
(function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){ (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o), m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m) })(window,document,'script','https://www.google-analytics.com/analytics.js','ga'); ga('create', 'UA-78709012-1', 'auto'); ga('send', 'pageview');