PE (ప్రైస్‌ టు ఎర్నింగ్స్ ) సగటున 10 ఏళ్ళ గరిష్టంలో ఈ స్టాక్స్ ! లాభాలు బుక్ చేసుకోవచ్చు?

PE (ప్రైస్‌ టు ఎర్నింగ్స్ ) సగటున 10 ఏళ్ళ గరిష్టంలో ఈ స్టాక్స్ ! లాభాలు బుక్ చేసుకోవచ్చు?

గత కొద్ది సెషన్స్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పూర్తిగా నిరాశాజనకంగా ఉన్నప్పటికీ.. నిఫ్టీ 50లోని కొన్ని స్టాక్స్ వాటి 10 ఏళ్ళ ప్రైస్‌ టు ఎర్నింగ్స్ యావరేజ్‌(PE) గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత ఇవి మరింత ఆకర్షణీయంగా మారొచ్చని ప్రముఖ బ్రోకింగ్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. నిఫ్టీ 50లోని ఓ 22 స్టాక్స్ వాటి 10 సంవత్సరాల గరిష్ట PE రేషియోకు చేరుకున్నాయి. PE  నిష్పత్తి కంపెనీ స్టాక్స్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి ఆధారంగా లెక్క కడతారు కాబట్టి  ఈ22 కంపెనీల ఆదాయాలు పెరగడంతో ఆ స్టాక్స్ వాల్యూయేషన్స్ పెరిగాయి.  దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పటికే గత నాలుగేళ్ళ గరిష్ట అస్ధిరతను నమోదు చేశాయి. ఎన్నికల ఫలితాలు రానుండటంతో మే 23 నాటికి ఇది మరింత దిగజారొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధిక ప్రీమియంలో ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ ఎన్నికల ఫలితాల నాటికి కొంత ఒత్తిళ్ళకు లోనవ్వొచ్చని బ్రోకింగ్ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. వీటిలో బజాజ్ ఆటో , మారుతీ సుజుకీ, ICICI  బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఏషియన్ పేయింట్స్ , ITC, టైటాన్ కంపెనీ, UPL, వంటి స్టాక్స్ కూడా ఉన్నాయని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓశ్వాల్ పేర్కొంది. ఈ స్టాక్స్ అన్ని వాటి 10 సంవత్సరాల గరిష్ట PE సగటు కంటే అధికంగా ట్రేడ్ అవుతున్నందున ప్రాఫిట్స్ బుక్ చేసుకోడానికి ఇది సరైన సమయమనే మోతీ లాల్ ఓశ్వాల్ భావిస్తోంది. బ్రిటానియా ఇండస్ట్రీస్, టైటాన్ వంటి స్టాక్స్ ప్రమీయం వాల్యూయేషన్స్ లో ఉన్నాయనీ, దేశంలో టాప్ 10 బెట్స్ లో టైటాన్ అగ్రస్థానంలో నిలవనుందని మోతీలాల్ ఓశ్వాల్ అంచనా వేస్తోంది.

 image (4)
ఎన్నికల ఫలితాల తరువాత మార్కెట్ల స్థిరీకరణ జరిగి , ఇండెక్స్‌లు పుంజుకునే సమయంలో ఈ 22 స్టాక్స్ మరింత ఫలవంతంగా ఉంటాయని ఛాయిస్ బ్రోకింగ్ సంస్థ అంచనా వేస్తోంది. నిఫ్టీ 50లోని ఈ 22 స్టాక్స్ "ఓవర్ బాట్" (Overbought) జోన్‌లో ట్రేడ్ అవుతాయని ఛాయిస్ బ్రోకింగ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకోడంలో అర్ధం ఉందని, ఒక వేళ వీటి ధరలు తరువాత పడినా తిరిగి కొనుగోలుకు అవకాశం ఉంది కాబట్టి లాభాల స్వీకరణకే మొగ్గు చూపొచ్చని బ్రోకింగ్ కంపెనీలు అంటున్నాయి. 
సాధారణంగా ముదపర్లు ఒక స్టాక్ కొనడం లేదా అమ్మడం విషయంలో కేవలం PE రేషియోనే ప్రామాణికంగా తీసుకోకుండా, కంపెనీ యొక్క బిజినెస్ సైకిల్‌ను పరిశీలించాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. బిజినెస్ సైకిల్ అప్‌సైడ్‌లో ఉంటే.. PE రేషియోలో గ్రోత్ కనడుబతుంది.  కంపెనీ ఫండమెంటల్స్, D/E నిష్పత్తి, PEG నిష్పత్తి, PEER పెర్ఫార్మెన్స్ , ఇండస్ట్రీ గ్రోత్ వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. 
 

Disclaimer: పైన సూచించిన సలహాలు, సూచనలు ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు, ఎనలిస్టులచే ఇచ్చినవి మాత్రమే. స్టాక్స్ ఎంపిక సమయంలో మరోసారి పరిశీలించుకోవాల్సిందిగా మనవి.



Most Popular