హుష్‌.. షరా నష్టాలు- చివర్లో డీలా

హుష్‌.. షరా నష్టాలు- చివర్లో డీలా

వరుస నష్టాల నుంచి బయటపడిన ఒక్క రోజులోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి పతన బాట పట్టాయి. మిడ్‌సెషన్‌ నుంచీ అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లు కంగుతిన్నాయి. తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ చివరికి ప్రస్తావించ దగ్గ నష్టాలతో ముగిసింది. 204 పాయింట్లు క్షీణించి 37,115 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 37,560 వరకూ ఎగసింది. ఈ బాటలో తొలుత 11,287 వరకూ జంప్‌చేసిన నిఫ్టీ 65 పాయింట్లు నీరసించి 11,157 వద్ద స్థిరపడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు కొనసాగనుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. మంగళవారం అమెరికా, యూరోపియన్ మార్కెట్లు లాభపడగా.. ఉదయం ఆసియాలోనూ సానుకూల వాతావరణం నెలకొంది.

Image result for media sector

రియల్టీ ప్లస్‌లో
ఎన్‌ఎస్‌ఈలో దాదాపు అన్ని రంగాలూ నష్టపోగా.. రియల్టీ 0.3 శాతం బలపడింది. మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 4-1 శాతం మధ్య వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో యస్‌ బ్యాంక్‌ 9 శాతం, టాటా మోటార్స్‌, జీ ఎంటర్‌టైన్‌ 7 శాతం చొప్పున పతనంకాగా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇండస్‌ఇండ్‌, గెయిల్‌, కోల్‌ ఇండియా, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ఫ్రాటెల్‌ 5-3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ 4.5 శాతం చొప్పున జంప్‌చేయగా, యూపీఎల్‌, బజాజ్ ఫిన్‌, ఐవోసీ, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, టైటన్‌ 4.5-0.8 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మీడియా కౌంటర్లలో జీ మీడియా 12 శాతం, డిష్‌ టీవీ 10 శాతం చొప్పున కుప్పకూలాయి. ఈ బాటలో హాథవే, టీవీ 18, డెన్‌, సన్‌ టీవీ, టీవీ టుడే సైతం 5-1.5 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు డౌన్‌
మిడ్‌సెషన్‌ నుంచీ మార్కెట్లు వెనకడుగు వేయడంతో మధ్య, చిన్నతరహా కౌంటర్లలోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం స్థాయిలో క్షీణించాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1555 నష్టపోగా.. 1002 లాభాలతో ముగిశాయి.

దేశీ ఫండ్స్‌ దన్ను
నగదు విభాగంలో సోమవారం రూ. 1056 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మంగళవారం రూ. 2012 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. అయితే సోమవారం రూ. 1058 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) మంగళవారం మరోసారి రూ. 2243 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.Most Popular