ఎస్‌ఆర్‌ఎఫ్‌- జస్ట్‌ డయల్‌.. భేష్‌

ఎస్‌ఆర్‌ఎఫ్‌- జస్ట్‌ డయల్‌.. భేష్‌

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిడెట్‌ కౌంటర్‌ దూకుడు చూపుతోంది. మరోవైపు గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆకర్షణీయ పనితీరు ప్రదర్శించడంతో జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 54 శాతం ఎగసి రూ. 191 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 28 శాతంపైగా పెరిగి రూ. 2088 కోట్లను అధిగమించింది. పూర్తి ఏడాది(2018-19)కి 39 శాతం అధికంగా రూ. 642 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 34 శాతం పెరిగి రూ. 7733 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌ఆర్‌ఎఫ్‌ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 2756 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 2815 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 52.32% వాటా ఉంది.

Related image

జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జస్ట్‌ డయల్‌ నికర లాభం 60 శాతం ఎగసి రూ. 62 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం పెరిగి రూ. 264 కోట్లను తాకింది. పూర్తి ఏడాది(2018-19)కి  కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 44 శాతం అధికంగా రూ. 207 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 16 శాతం పెరిగి రూ. 984 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జస్ట్‌ డయల్‌ షేరు 3 శాతం వృద్ధితో రూ. 577 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 583 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. కంపెనీలో ప్రమోటర్లకు 33.84% వాటా ఉంది.Most Popular