క్యూ4- షేర్ల సొగసు చూడతరమా?

క్యూ4- షేర్ల సొగసు చూడతరమా?

గత ఆర్థిక సంవత్సరం(2018-19) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఎస్‌ఆర్ఎఫ్‌ లిమిటెడ్‌, డీసీఎం శ్రీరామ్‌, డీసీబీ బ్యాంక్‌, టైటన్‌ కంపెనీ, మెర్క్‌ లిమిటెడ్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ కౌంటర్లనీ సరికొత్త గరిష్టాలను తాకడంతోపాటు.. చెప్పుకోదగ్గ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం...

ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో 5.8 శాతం దూసుకెళ్లి రూ. 2750 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2815 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! క్యూ4లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం 54 శాతం పెరిగి రూ. 191 కోట్లను తాకింది.

డీసీఎం శ్రీరామ్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మెర్క్‌ లిమిటెడ్‌ షేరు 4.25 శాతం జంప్‌చేసి రూ. 522 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 530ను చేరింది. ఇది 52 వారాల గరిష్టంకావడం విశేషం! క్యూ4లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం ఆరు రెట్లు ఎగసి రూ. 293 కోట్లను తాకింది.

మెర్క్‌ లిమిటెడ్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో మెర్క్‌ లిమిటెడ్‌ షేరు 2.2 శాతం పుంజుకుని రూ. 4120 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 4150ను చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం! క్యూ4లో నికర లాభం 79 శాతం పెరిగి రూ. 41 కోట్లను తాకింది.

డీసీబీ బ్యాంక్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో డీసీబీ బ్యాంక్‌ షేరు 1.5 శాతం లాభపడి రూ. 221 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 225 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం!

టైటన్‌ కంపెనీ: ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో టైటన్‌ కంపెనీ షేరు 0.75 శాతం బలపడి రూ. 1163 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1167ను అధిగమించింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకావడం విశేషం!