కొనుగోళ్ల కళకళ- మీడియా వెలవెల

కొనుగోళ్ల కళకళ- మీడియా వెలవెల

వరుస నష్టాల నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు జోరు చూపుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సెన్సెక్స్‌ తొలుత లాభాల డబుల్‌ సెంచరీ చేసింది. 37,560 వరకూ ఎగసింది. ప్రస్తుతం 142 పాయింట్ల లాభంతో 37,461 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో ఇంట్రాడేలో 11,287 వరకూ జంప్‌చేసిన నిఫ్టీ ప్రస్తుతం 30 పాయింట్లు పుంజుకుని 11,252 వద్ద ట్రేడవుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాద పరిష్కార చర్చలు కొనసాగనుండటంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు మెరుగుపడింది. మంగళవారం అమెరికా, యూరోపియన్ మార్కెట్లు లాభపడగా.. ఆసియాలోనూ సానుకూల వాతావరణం నెలకొంది.

పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, ఆటో, రియల్టీ, ప్రియవేట్‌ బ్యాంక్స్‌ 0.3 శాతం చొప్పున బలపడగా.. మీడియా 3.4 శాతం పతనమైంది. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, వేదాంతా 3.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యస్‌ బ్యాంక్‌ 5.6 శాతం పతనంకాగా.. టాటా మోటార్స్‌, గెయిల్‌, ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 3.6-1.3 శాతం మధ్య క్షీణించాయి. మీడియా కౌంటర్లలో జీ మీడియా, జీ ఎంటర్‌టైన్‌, డిష్‌ టీవీ 9-8 శాతం మధ్య కుప్పకూలాయి. ఈ బాటలో టీవీ 18, డెన్‌, సన్‌ టీవీ సైతం 2-1 శాతం మధ్య డీలాపడ్డాయి.

జీ గ్రూప్‌.. బేర్‌
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో ఎస్‌ఆర్ఎఫ్‌, జస్ట్‌డయల్‌, ఇండిగో, ఐడీఎఫ్‌సీ, ఇన్ఫీబీమ్‌, ఈక్విటాస్‌, పిడిలైట్‌, నెస్లే ఇండియా 6.4-2.2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా మరోపక్క యూనియన్‌ బ్యాంక్‌ 9 శాతం కుప్పకూలగా.. సుజ్లాన్, దివాన్‌ హౌసింగ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, అదానీ పవర్‌, ఐడియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 6-5 శాతం మధ్య పతనమయ్యాయి. 

చిన్న షేర్లు అటూఇటూ
మార్కెట్లు హుషారుగా కదులుతున్నప్పటికీ మధ్య, చిన్నతరహా షేర్లలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. బీఎస్ఈలో మిడ్‌  క్యాప్‌ 0.15 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ 0.2 శాతం నీరసించింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1177 లాభపడగా.. 1093 నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular