జెట్‌ స్లాట్స్‌- ఎయిర్‌వేస్‌ జూమ్

జెట్‌ స్లాట్స్‌- ఎయిర్‌వేస్‌ జూమ్

ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని కార్యకలాపాలు నిలిపివేయడంతో జెట్ ఎయిర్‌వేస్‌ స్లాట్‌లను ప్రభుత్వం ఇతర విమానయాన సంస్థలకు కేటాయిస్తోంది. స్లాట్‌ కేటాయింపుల కమిటీ జెట్ ఎయిర్‌వేస్‌కు చెందిన 480 స్లాట్‌లను ఇతర సంస్థలకు కేటాయించింది. దీంతో లబ్ది పొందిన ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, స్పైస్‌జెట్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ షేర్లకు డిమాండ్‌ పెరగడంతో లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం...

స్పైస్‌జెట్‌ లిమిటెడ్
చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ షేరు ప్రస్తుతం బీఎస్‌ఈలో దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 130 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 134 వరకూ ఎగసింది. మొత్తం 130 స్లాట్‌లను తాజాగా పొందింది. వీటిలో ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చెందిన  68 స్లాట్‌లుండటం కంపెనీకి కలసి వచ్చే అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా.. మరోపక్క జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు పతనబాటలో సాగుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం పడిపోయి రూ. 122 వద్ద ట్రేడవుతోంది.

Image result for spice jet and vistara airlines

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌
ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో దాదాపు 3 శాతం ఎగసి రూ. 1606 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1622 వరకూ ఎగసింది. మొత్తం 127 స్లాట్‌లను తాజాగా ఇండిగో పొందింది. తద్వారా జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన అత్యధిక స్లాట్‌లను పొందిన రెండో కంపెనీగా నిలిచింది. ఈ బాటలో విస్తారా ఎయిర్‌లైన్స్‌కు 110, గోఎయిర్‌కు 44, ఎయిర్‌ ఏషియాకు 42 స్లాట్‌లను కేటాయించినట్లు తెలుస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు తాత్కాలిక ప్రాతిపదికన ఏప్రిల్‌ 17 నుంచీ నిలిచిపోయిన విషయం విదితమే. దీంతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 766 స్లాట్‌లు పెండింగ్‌లో పడ్డాయి. వీటిలో 420వరకూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లవేకావడం గమనార్హం!Most Popular